Rajamouli: రాజమౌళి అనుభవించిన దుర్భర పరిస్థితులు... అందుకే దానాలకు దూరమా!

First Published Nov 3, 2021, 8:27 AM IST

దేశం మెచ్చిన దర్శకుల్లో ఒకరిగా ఎదిగారు ఎస్ ఎస్ రాజమౌళి. ఆఫర్స్ కోసం స్టార్ హీరోల చుట్టూ దర్శకులు తిరగడం ఆనవాయితీ. రాజమౌళి విషయంలో అది రివర్స్, స్టార్ హీరోలు సైతం Rajamouli తమకు ఒక అవకాశం ఇవ్వాలని, తమతో ఓ చిత్రం చేయాలని కోరుకుంటారు. 
 

ఇక ఆయన ఊ... అంటే కథేంటి, హీరో ఎవరూ? అని అడగకుండా బ్లాంక్ చెక్ చేతిలో పెట్టే నిర్మాతలు కోకొల్లలు. బాహుబలి మూవీ తరువాత ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. వేల కోట్ల వసూళ్లు ఇండియన్ సినిమాకు సాధ్యమే అని నిరూపించిన దర్శకుడు రాజమౌళి. 

అలాంటి రాజమౌళి రెమ్యూనరేషన్ ఊహించడానికి కూడా కష్టమే. ఇంత వరకు ఓటమి ఎరుగని రాజమౌళి స్టార్ హీరోల కంటే కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారు. అది వంద కోట్లకు పైమాటే అనేది ఇండస్ట్రీ టాక్. Bahubali సినిమాతో వచ్చిన లాభాలలో రాజమౌళి కూడా భాగం పంచుకున్నారని వినికిడి. 

ఇంత సంపాదన ఉన్న రాజమౌళి దానాల విషయంలో ఎప్పుడూ వెనకుంటారు. Chiranjeevi స్థాపించిన కరోనా క్రైసిస్ చారిటీ కోసం రాజమౌళి కేవలం రూ. 10లక్షలు దానం చేశారు. అది కూడా ప్రొడ్యూసర్ దానయ్య ద్వారా అందినట్లు సమాచారం. ఈ విషయంలో రాజమౌళి సోషల్ మీడియా విమర్శలకు గురయ్యారు. వందల కోట్ల సంపాదన కలిగిన రాజమౌళి కేవలం రూ. 10 లక్షలు దానం చేయడం ఏమిటని కొందరు ప్రశ్నించారు. 
 


రాజమౌళి డబ్బులు విషయంలో ఇంత కఠినంగా ఉండడానికి కారణం, ఆయన ఒకప్పటి పరిస్థితులే అని, ఆయన తాజా కామెంట్స్ ద్వారా తెలుస్తుంది. రాజమౌళి దర్శకుడిగా మారక ముందు తనకు రూపాయి సంపాదన ఉండేది కాదట. సినిమా ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో భార్య రమా రాజమౌళిపైనే ఆధారపడ్డారట. ఆమె సంపాదతోనే కొన్నాళ్ళు నా లైఫ్ గడిచింది, ఆ విషయం చెప్పడానికి నేను సిగ్గు పడను అంటూ రాజమౌళి, తన గత జీవితం గుర్తు చేసుకున్నారు. 

ఒక ప్రక్క దర్శకుడు కావాలనే ప్రయత్నాలు చేస్తూనే, తన భార్యను రోజూ ఆఫీస్ వద్ద డ్రాప్ చేయడం, తిరిగి ఇంటికి తీసుకురావడం చేసేవాడట. అలా కొన్నేళ్లు తనను Rama rajamouli పోషించినట్లు రాజమౌళి వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. దర్శకుడు కావాలనే తపన ఉన్నప్పటికీ, చేతిలో డబ్బులు లేకపోవడంతో ఒక్కోసారి ఆత్మ విశ్వాసం సన్నగిల్లేది. నాన్న విజయేంద్ర ప్రసాద్ పరిశ్రమలో ఉండడం వలన, అన్ని క్రాఫ్ట్స్ లో పని చేసి, పట్టు సాధించానని, రాజమౌళి తెలియజేశారు. 

రాజమౌళి ఇంత ఎకనమిక్ గా ఉండడానికి బహుశా కెరీర్ బిగినింగ్ లో ఆయన చూసిన దుర్భర పరిస్థితులే కారణం కావచ్చు. అందుకే డబ్బులు ఉన్నాయి కదా అని మితిమీరిన దానాలు, ఖర్చులు చేయకూడని రాజమౌళి నిర్ణయించుకొని ఉండవచ్చు. దురలవాట్లు, జల్సాలకు కూడా రాజమౌళి చాలా దూరం అనిసమాచారం. 

దర్శక ధీరుడు రాజమౌళి కుటుంబం


అయితే మరో కోణంలో ఆయన ఫ్యామిలీ చాలా రకాలా ఛారిటీలు నిర్వహిస్తున్నారని సమాచారం. ప్రచారం చేసుకోకున్నా, కొన్ని ధార్మిక సంస్థలను రాజమౌళి కుటుంబం నడుపుతున్నారట. మరి ఇంత చేసినా ప్రచారం చేసుకోకపోతే, జనాలు ఇలాంటి విమర్శలే చేస్తుంటారు. నిజం ఏదైనా ఫోకస్ అయ్యిందే లెక్కలోకి వస్తుంది. 

ఇక రాజమౌళి ప్రతి సినిమాకు కుటుంబం మొత్తం పని చేస్తారు. సంగీత దర్శకుడిగా అన్న కీరవాణి చేస్తుండగా, వదిన వల్లి, భార్య రమా కాస్ట్యూమ్ డిజైనర్స్ గా, కొడుకు కార్తికేయ ప్రొడక్షన్... ఇలా మొత్తం ఫ్యామిలీ మమేకం అవుతారు. అందరూ విజయం కోసం కష్టపడి పని చేస్తారు. ఎంత ఎదిగినా, ఒదిగి ఉండే రాజమౌళి, తన విజయంలో కీలక పాత్ర భార్యదే అంటాడు. 

Also read ఆర్ ఆర్ ఆర్ కి దారిచ్చిన పవన్, మహేష్... ప్రభాస్ మాత్రం ఢీ!

Also read RRR glimpse: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌, అజయ్‌ దేవగన్, అలియాలతో వర్క్ చేయడంపై రాజమౌళి హాట్‌ కామెంట్‌

click me!