Guppedantha Manasu: అందమైన క్షణాలను గడుపుతున్న వసుధార, రిషి.. కోపంతో రగిలిపోతున్న దేవయాని!

Navya G   | Asianet News
Published : Dec 08, 2021, 11:12 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమౌతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో సాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
17
Guppedantha Manasu: అందమైన క్షణాలను గడుపుతున్న వసుధార, రిషి.. కోపంతో రగిలిపోతున్న దేవయాని!

వసు (Vasu) కార్తీకమాసం వన భోజనాల దగ్గర అన్ని పనులు చేశాక కాసేపు తాను చెట్టు దగ్గరికి వెళ్లి ఉయ్యాల ఊగుతూ రిషిని (Rishi) గుర్తుకు చేసుకుంటుంది. ఇంతలోనే వెనకాల నుంచి తనకు ఎవరో వచ్చినట్లు అనిపించడంతో వెనుకాల చూసేసరికి రిషి ఉంటాడు.
 

27

ఇద్దరూ ఒకరికొకరు ఇంకా వెళ్లలేదా అని అనుకుంటూ మాట్లాడుకుంటారు. వసు (Vasu) అక్కడున్న వాతావరణం గురించి రిషికి అద్భుతంగా వివరిస్తుంది. చిన్ననాటి జ్ఞాపకాల గురించి మాట్లాడటంతో రిషి (Rishi) తన బాల్యాన్ని గుర్తు చేసుకొని బాధపడతాడు.
 

37

ఇక వసు (Vasu) రిషిని ఉయ్యాల ఊగమని అనటంతో కాసేపు మొహమాటం పడతాడు. వసు బ్రతిమాలడం తో రిషి (Rishi) ఉయ్యాల పై కూర్చోగా తాను వెనకాలనుంచి ఊపుతుంది. అప్పుడు దేవయాని రిషికి ఫోన్ చేయటంతో కాసేపు మాట్లాడుతుండగా ఫోన్ జారి పడుతుంది. 
 

47

వెంటనే వసు (Vasu) అయ్యో రిషి సర్ అని అనడంతో కోపంతో  దేవయాని రగిలిపోతుంది. ఈ వసు ఎప్పుడు రిషి పక్కనే ఉంటుందని కోపం తో రగిలిపోతుంది. ఇక రిషి (Rishi) తనతో గడిపిన అందమైన క్షణాల గురించి వసుతో చెప్పుతో సంతోషంగా ఫీల్ అవుతాడు.
 

57

అలా కాసేపు మాట్లాడుతూ రిషి (Rishi) నీకు ఒక విషయం చెప్పాలి అని వసుతో అంటాడు. వెంటనే వసు ఏంటి సార్ అని అడగటంతో అప్పుడే పుష్ప వచ్చి వసు ను వెళ్దామని కారు వచ్చిందని అంటుంది. అప్పుడే మరో వ్యక్తి వచ్చి కారులో ఒకరు మాత్రమే కూర్చోవచ్చని చెప్పటంతో పుష్ప (Pushpa) తాను వెళ్తానని అంటుంది. వసును రిషి కారులో రమ్మంటుంది.
 

67

మరోవైపు జగతి (Jagathi) మహేంద్ర వర్మ తో ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అంటుంది. అక్కడ రిషి ఇంటికి వస్తాడు రిషిని పలకరించాలి కదా అని అంటుంది. అందుకే దేవయాని (Devayani)  అక్క మనల్ని తిడుతుంది అంటూ బాధపడుతుంది.
 

77

వసు బాధ పడటం తో రిషి (Rishi) కూల్ చేస్తాడు. ఇక మధ్యలో కారు ఆగిపోవటంతో రోడ్డుపైన దిగి సర్వీస్ చేసే వాళ్లకు ఫోన్ చేసి వాళ్లను రమ్మంటాడు. ఇక వసు (Vasu) ఫోన్ తీయడంతో కాసేపు సెల్ఫీ దిగుతారు. అక్కడ కాసేపు అందమైన క్షణాలను గడుపుతారు.

click me!

Recommended Stories