తన హార్ట్ బ్రేకింగ్‌ విషయాన్ని బయటపెట్టిన శ్రియా.. ఆ బాధలో షూటింగ్‌ చేశానంటూ ఎమోషనల్‌..

First Published Dec 8, 2021, 10:49 AM IST

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిన శ్రియా శరణ్‌ మ్యారేజ్‌ తర్వాత సినిమాలకు బ్రేకిచ్చింది. అడపాదడపా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. తాజాగా శ్రియా తన జీవితంలోని ఓ హార్ట్ బ్రేకింగ్‌ విషయాన్ని బయపెట్టింది. తన జీవితంలో మర్చిపోలేని రోజని వెల్లడించింది. 
 

శ్రియా శరన్‌(Shriya Saran) ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమని ఓ ఊపు ఊపింది. చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకీ, ఎన్టీఆర్‌, ప్రభాస్‌, మహేష్‌బాబు, పవన్‌ కళ్యాణ్‌, రవితేజ ఇలా స్టార్‌ హీరోలందరితోనూ ఆడిపాడింది. స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. ప్రేమ, మ్యారేజ్‌, పిల్లలు కారణంగా సినిమాలకు గ్యాపిచ్చింది Shriya Saran. మళ్లీ కెరీర్‌పై దృష్టిపెట్టింది. ఇప్పుడు బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆమె సినిమాలు చేస్తుంది. అందులో భాగంగా `ఆర్‌ఆర్‌ఆర్‌`, `గమనం` సినిమాలో నటిస్తుంది. 
 

తాను నటించిన గమనం` చిత్రం ఈ నెల 10(శుక్రవారం) విడుదల కానుంది. శ్రియాతోపాటు, నిత్యా మీనన్‌, ప్రియాంక జవాల్కర్‌, శివ కందుకూరి ప్రధాన పాత్రలు పోషించారు. సంజనారావు దర్శకత్వం వహించారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా శ్రియా ముచ్చటించింది. 

ఈ సందర్భంగా శ్రియా ఓ షాకింగ్‌ విషయం వెల్లడించింది. తన జీవితంలో చోటు చేసుకున్న హార్ట్ బ్రేకింగ్‌ లాంటి విషయాన్ని షేర్‌ చేసుకుంది. `గమనం` సినిమా సమయంలో తన ఫ్రెండ్‌ చనిపోయిందట. `షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే నా ఫ్రెండ్‌ చనిపోయింది. అప్పుడు నా హార్ట్ బ్రేక్‌ అయ్యింది` అని పేర్కొంది శ్రియా. అయితే ఆ బాధని దిగమింగుకుని షూటింగ్‌లో పాల్గొన్ని వెల్లడించింది. తన జీవితంలో ఆ రోజులు మర్చిపోలేనివని తెలిపింది.  

ఇక `గమనం` సినిమా గురించి చెబుతూ, ఈ చిత్ర కథ విన్నప్పుడు తన కంట్లో నీళ్లు తిరిగాయని చెప్పింది. ఈ సినిమాలో తాను దివ్యాంగురాలి పాత్రలో కనిపిస్తుందట. వినికిడి లోపం. చెవులు వినిపించవు. కానీ మాట్లాడగలుగుతుందట. నిస్సహాయతలో ఉన్న మహిళ పాత్ర తనదని చెప్పింది శ్రియా. ఊహకందని ఓ అతీంద్రియ శక్తి ఉందని నమ్ముతుందట. ఎప్పుడూ ఒక రూమ్‌లోనే ఉంటుందట. దాన్నుంచి బయటకు
రావడమే తన విజయం అని చెప్పింది.

ఈ పాత కోసం కొన్ని రోజులు క్లాసులకు కూడా వెళ్లానని పేర్కొంది. ముందస్తుగా బాగా ప్రిపేర్ అయ్యానని పేర్కొంది. ఇకపై బలమైన పాత్రలు చేయాలనుకుంటున్నట్టు తెలిపింది శ్రియా. తన కూతురు నా సినిమాలు చూసి ఇలాంటివి ఎందుకు చేశావ్‌ మమ్మి అని ప్రశ్నించేలా ఉండకూదని అనుకుంటున్నట్టు తెలిపింది. అయితే తన పని పట్ల తాను ఎప్పుడూ గర్వంగానే ఫీల్‌ అవుతుందట.

కరోనా గురించి చెబుతూ, కరోనా సమయంలో ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతో మంది పనులు లేకుండా అవస్థలు పడ్డారు. ఇప్పుడు సినిమా పరిశ్రమ కోలుకుంటోంది. నేను ఎంత వరకు బతికి ఉంటానో.. అప్పటి వరకు నటిస్తూనే ఉండాలని, సినిమాలు చేస్తూనే ఉండాలని అనుకుంటాను. 

సినిమాల పట్ల ఇప్పుడు నా దృక్పథం మారింది. నా కూతురు, నా ఫ్యామిలీ నా సినిమాలు చూసి గర్వపడేలా ఉండాలని అనుకుంటున్నాను. ఏ పాత్ర చేసినా కూడా నా మనసుకు నచ్చాలని అనుకుంటున్నాను` అని చెప్పారు. 
 

`ఆర్‌ఆర్‌ఆర్‌` గురించి స్పందిస్తూ, `ఆర్ఆర్ఆర్` సినిమా గురించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేనని, ఇది సరైన టైమ్‌ కాదని చెప్పింది. రాజమౌళితో చాలా ఏళ్ల తర్వాత కలిసి పనిచేశానని, ఆయన చెప్పినప్పుడే ఈ సినిమా గురించి ఓపెన్‌ అవుతామని వెల్లడించింది. 
 

అయితే ఇందులో బట్టలు కుట్టే పాత్రలో కనిపిస్తుందట. `నాకు బట్టలు కుట్టడం నాకు రాదు. కానీ కమల పాత్ర కోసం నేర్చుకున్నాను. మా అమ్మ ఎక్కువగా బట్టలు కుడుతుంది. ఈ పాత్రకు నాకు అస్సలు పోలీక ఉండదు. కానీ ఎమోషన్స్ పరంగా చాలా కనెక్షన్ ఉంటుంది` అని తెలిపింది. 
 

`ప్రెగ్నెన్సీ తరువాత చాలా మార్పులు వచ్చాయి. కానీ వర్కవుట్లు చేసి, కథక్ డ్యాన్స్ చేస్తూ ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టాను. పైగా మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి యోగా నేర్పించారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యం, ఫిట్ నెస్ అంతా బాగుంటుంది. పిల్లలు పుట్టాక ప్రపంచం మారుతుంది. మనకు బాధ్యతలు పెరుగుతాయి. మనిషిలో మార్పులు వస్తాయి. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లినా మా పాపను తీసుకుని వెళ్తున్నాం` అని తెలిపింది. 

also read: Samantha:చైతన్యతో విడాకులు, ప్రాణం పోతుందని భయపడ్డ సమంత... మొదటిసారి షాకింగ్ విషయాలు చెప్పిన స్టార్ లేడీ
 

click me!