ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. దేవయాని ఇంట్లో కూర్చొని ఉండగా అప్పుడే మహేంద్ర, జగతి వాళ్ళు వస్తారు. అయిపోయిందా సన్మానాలు, సత్కారాలు అని అడిగితే మీరు అక్కడినుంచే వచ్చారు కదా మీకు ఆ మాత్రం తెలియదా అని దేవయానిపై మహేంద్ర సెటైర్ వేస్తాడు. దీంతో వెంటనే ఆ వసుధార ఏంటి రిషి మేడలో అలా పూలదండ వేసింది అని జగతిని అంటే.. మీకు ఏదైనా డౌట్ ఉంటే రిషిని, వసును వెళ్లి అడగండి అంటుంది..