మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన దంపతులు ఇటీవలే తమ 10వ వెడ్డింగ్ యానవర్సరీ పూర్తి చేసుకున్నారు. ఈ క్రేజీ కపుల్ కి వివాహమై పదేళ్లు గడుస్తోంది. రాంచరణ్, ఉపాసన వివాహం 2012లో వైభవంగా జరిగింది. పెళ్ళైనప్పటి నుంచి వీరిద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు.
26
కానీ ఈ జంటకు ఇంకా సంతానం లేదు. ఇది వాళ్ళ వ్యక్తి గత విషయం అయినప్పటికీ సోషల్ మీడియాలో దీని గురించి చర్చ జరుగుతూనే ఉంది. మీడియా ముందు ఈ ప్రశ్న ఎదురైనా ఉపాసన దాటవేస్తూ వచ్చింది. వివాహం జరిగిన పదేళ్లు కావడంతో ఈ చర్చ ఎక్కువవుతోంది. దీనితో ఉపాసన కూడా స్పందించడం మొదలు పెట్టింది.
36
ఆధ్యాత్మిక గురువు సద్గురుతో జరిగిన కార్యక్రమంలో ఉపాసన కొణిదెల పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఉపాసన సద్గురుని అనేక ప్రశ్నలు అడిగింది. ఆశ్చర్య కరంగా తాను పిల్లలని కనడం గురించి కూడా సద్గురు వద్ద ఉపాసన ప్రశ్నించింది. ఉపాసన మాట్లాడుతూ.. నేను వివాహం చేసుకుని పదేళ్లు అవుతోంది. నా జీవితం చాలా హ్యాపీగా సాగుతోంది. నా ఫ్యామిలీని నా జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను.
46
కానీ చాలా మంది ప్రజలు నా లైఫ్ లో ఆర్ఆర్ఆర్ గురించే ఎక్కువ చర్చించుకుంటున్నారు. మొదటి ఆర్.. నా రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతున్నారు.. రెండవ ఆర్.. రీ ప్రొడ్యూస్ (పిల్లలు కనగలిగే సామర్థ్యం), మూడవ ఆర్.. లైఫ్ లో నా రోల్.. వీటి గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు అంటూ సద్గురుకి తెలిపింది.
56
దీనికి సద్గురు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. రిలేషన్ షిప్ అది నీ పర్సనల్.. దాని గురించి నేను మాట్లాడను. ఇక రీ ప్రొడ్యూస్ విషయానికి వస్తే.. ఆరోగ్యంగా ఉండి కూడా పిల్లలు కనకూడదు అని నిర్ణయించుకున్న వారిని నేను అభినందిస్తాను. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ జనాభా 10 కోట్లు సమీపిస్తోంది. సమానం అంతరించిపోతున్న జీవులం కాదు. ఇంకా ఎక్కువవుతున్నాం.
66
upasana
ఒక వేళ మీరు కనుక పులి అయి.. మీ జాతి అంతరించిపోతోంది పిల్లల్ని కనండి అని చెప్పేవాడిని అంటూ సద్గురు సరదాగా వ్యాఖ్యానించారు. ఉపాసన ఒక వేదికపై ఈ విషయాన్ని ప్రస్తావించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.