Prema Entha Madhuram: చెల్లెలు కోసం ఆరాటపడుతున్న అను.. రాగసుధను చంపడానికి ప్రయత్నిస్తున్న ఆర్య!

Navya G   | Asianet News
Published : Jan 31, 2022, 08:16 AM IST

Prema Entha Madhuram: బుల్లితెరపై ప్రసారం అవుతున్న ప్రేమ ఎంత మధురం (Prema entha madhuram) సీరియల్  ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కథ నేపథ్యంలో కొన సాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అను ఉదయాన్నే ఆర్యకు చెప్పకుండా గుడికి వెళుతుంది. రాగ సుధ (Raga sudha) వస్తుందేమో అన్న ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది.  

PREV
15
Prema Entha Madhuram: చెల్లెలు కోసం ఆరాటపడుతున్న అను.. రాగసుధను చంపడానికి ప్రయత్నిస్తున్న ఆర్య!

మరోవైపు జిండే (Jinde) గాయపడిన కాలుతో రాగసుధ కోసం వెతుకుతూ ఉంటాడు. ఈలోపు జిండే కు ఆర్య ఫోన్ చేసి ఎలాగైనా రాగసుధ ను కనిపెట్టాలి అని డిమాండ్ చేస్తాడు. ఒకవైపు గుడిలో అను అలానే వెతుకుతూ ఉంటుంది. ఆ క్రమంలో పూజారి నీకు రాగసుధ (Raga sudha) ఏమౌతుంది అని అడగగా చెల్లి అని చెబుతుంది. దానికి పూజారి ఆశ్చర్యపోతాడు.
 

25

అలా గుడిలో రాగసుధ (Raga sudha) కోసం వెతుకుతున్న అను దగ్గరకు ఆర్య వస్తాడు. ఇక ఆర్యకు, అను ఎదో ఒకటి చెప్పి కవర్ చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అను (Anu) రాగ సుధ పేరిట అర్చన చేయిస్తుంది. అంతేకాకుండా పూజారికి తన మొబైల్ నెంబర్ ఇచ్చి రాగసుధకు  ఇవ్వమని చెబుతుంది.
 

35

తర్వాత అను, ఆర్య (Arya) లు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన అను జిండే గాయపడిన కాలును చూసి ఏమైందని అడుగుతుంది. ఆ టైంలో జిండే కు ఎం చెప్పాలో అర్ధం కాదు. ఈలోపు ఆర్య, జిండే (Jinde) కు వృత్తి పరంగా ఇవన్నీ కామన్ నువు లోపలికి వెళ్ళు అను అని చెబుతాడు. తర్వాత అను జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళుతుంది.
 

45

తర్వాత అక్కడ ఆర్య (Arya) వాళ్ళ తల్లి, జిండే, ఆర్య ముగ్గురు కలిసి రాగ సుధ కోసం చర్చించుకుంటూ ఉంటారు. ఒకవైపు అను హడావిడిగా లోపలికి వెళ్లి  పూజారి కి కాల్ చేసి రాగ సుధ (Raga sudha) కోసం అడుగుతుంది. కానీ పూజారి తను ఇంకా రాలేదు అని చెబుతాడు.
 

55

ఆ తరువాత అను (Anu) తన అత్తయ్య కోసం వంట చేసి పెడుతుంది. ఇక టేస్ట్ చేసిన ఆమె చాలా బాగుంది అని చెబుతోంది. ఇక ఆర్య వాళ్ళు రాగ సుధ (Raga sudha) ను వెతికే క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి

click me!

Recommended Stories