Guppedantha Manasu: వసుతో ఉన్న రిలేషన్ బయటపెట్టిన రిషి.. కోపంతో రగిలిపోతున్న దేవయాని!

Navya G   | Asianet News
Published : Mar 22, 2022, 10:24 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Guppedantha Manasu: వసుతో ఉన్న రిలేషన్ బయటపెట్టిన రిషి.. కోపంతో రగిలిపోతున్న దేవయాని!

మహేంద్ర (Mahendra) ఇంటి నుంచి బయటకు వెళ్లినందుకు రిషి ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్ప కూలి పోతాడు. ఇక ఆ క్రమంలో రిషి (Rishi) మహేంద్ర తో తీపి జ్ఞాపకాలు ఊహించుకొని ఎంతో బాధపడతాడు. మరోవైపు జగతి నువ్వు ఈ నిర్ణయం తీసుకుని తొందర పడ్డావు మహేంద్ర అని అంటుంది. మహేంద్ర మాత్రం చాలా ఆలస్యం అయిందని అంటాడు.
 

26

ఇక అదే క్రమంలో జగతి (Jagathi) రిషి కి తండ్రి మీద కూడా ద్వేశం పెరుగుతుందని అంటుంది. అదే క్రమంలో జగతి (Jagathi) ఏదేమైనా సరే నువ్విలా రావడం కరెక్ట్ కాదు మహేంద్ర అని జగతి అక్కడి నుంచి కోపంగా వెళుతుంది. మరోవైపు లెటర్ చదివిన దేవయాని మహేంద్ర ఇలా చేస్తాడు అనుకోలేదు అని అంటుంది.
 

36

ఈ కార్యక్రమంలో దేవయాని (Devayani) వెళ్లిపోయి రిషి కి దూరం అయ్యాడని బాధపడాలా లేక జగతికి దగ్గర అయ్యాడని సంతోషపడాలా అని ఆలోచిస్తుంది. అదే క్రమంలో ధరణి (Dharani) అత్తయ్య గారు చిన్న మామయ్య గారికి ఫోన్ చేయాలా అని అడుగుతుంది. దాంతో దేవయాని ధరణి పై ఒక రేంజ్ లో విరుచుకుపడుతుంది.
 

46

అదే క్రమంలో పోయిన మహేంద్ర కు రిషి మీద ప్రేమ లేనప్పుడు మనమేం చేస్తాం గౌతమ్ (Goutham) అని దేవయాని అంటుంది. ఇక ఆ తర్వాత బాధపడకు రిషి (Rishi) అంటూ మనసులో నవ్వుకుంటూ దేవయాని రిషి ను ఊసిగోలుపుతుంది. ఆ తర్వాత రిషి వసు పనిచేసే రెస్టారెంట్ కి వెళ్లి డ్యూటీ అయ్యేంత వరకు ఉండి వసు (Vasu) ను ఒక చోటకి కారులో తీసుకొని వెళతాడు. 
 

56

ఇక వసు ను ఒక చోటికి తీసుకు వెళ్లి రిషి (Rishi) మా డాడీ ఇల్లు వదిలి వెళ్ళిపోవడం లో ఎవరిది తప్పు అని అడుగుతాడు. అంతే కాకుండా మహేంద్ర సార్ చేసింది కరెక్ట్ అంటావా అని అడుగుతాడు. దాంతో వసు (Vasu)  ఇది మీ పర్సనల్ విషయం కదా అని అంటుంది.
 

66

ఇక రిషి (Vasu) మా వ్యక్తిగత విషయాల్లో ఎప్పుడు కలుగ చేసుకోలేదా అని అడుగుతాడు. అంతేకాకుండా నాకు ఒక స్టూడెంట్ లాగా కాదు. ఒక ఫ్రెండ్ లా సలహా కావాలి అని అంటాడు. మొత్తానికి వసుధారను ఫ్రెండ్ లాగా ట్రై చేస్తున్నాడు రిషి. ఇక వసు రిషి (Rishi) ను తనతో పాటు జగతి ఇంటికి తీసుకుని వెళుతుంది.

click me!

Recommended Stories