Guppedantha Manasu: కుటుంబ సభ్యులకి భోజనం వడ్డించిన రిషి! దేవయాని ఇంట్లో బొమ్మలు కొలువు సంబరాలు!

Published : Oct 13, 2022, 09:46 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు అక్టోబర్ 13వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..  

PREV
17
Guppedantha Manasu: కుటుంబ సభ్యులకి భోజనం వడ్డించిన రిషి! దేవయాని ఇంట్లో బొమ్మలు కొలువు సంబరాలు!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..గౌతమ్ రిషి వాళ్ళ దగ్గరికి వస్తాడు. రిషి చేతిలో బొమ్మలను చూసి బొమ్మలు చాలా బాగున్నాయి రా అని తీసుకునేలోగా, రిషి వాటిని తిరిగి లాక్కొని ఇవి నా బొమ్మలు అని అంటాడు. దానికి గౌతమ్, నీకు చాలా ఎక్కువ అయింది రా అని ఎటకారంతో అనగా, అది సరే కానీ నాకు నువ్వు ఒక చిన్న సహాయం చేయాలి మన ఇంట్లో బొమ్మలకొలువు పెడుతున్నాము దానికి నువ్వు సహాయం చేయాలి అని అంటాడు.అప్పుడు గౌతమ్, తప్పుతుందా సరే అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్లో ఇంట్లో అందరూ కింద భోజనం దగ్గర కూర్చొని ఉండగా రిషి రాడు.రిషి ఏడి అని దేవయాని అడగగా, మెసేజ్ పెట్టాను మేడం సార్ వస్తున్నారు అని వసు ఉంటుంది. దానికి దేవయాని మొఖం మాడుస్తుంది. ఇంతలో రిషి అక్కడికి వస్తాడు. ఏమైంది రిషి ఇంత లేటుగా వచ్చావు అని మహేంద్ర అడగగా, ఏవో ఆలోచనలలో ఉండిపోయాను డాడ్ అయినా మీరైనా మెసేజ్ చేయాలి కదా కిందకి రమ్మని అని అంటాడు రిషి. అప్పుడు గౌతమ్ మనసులో, నీకు మెసేజ్ చేయాల్సిన వాళ్లు చేశారు కదరా అని అనుకుంటాడు.ఇంతలో ధరణి వడ్డించబోతుండగా రిషి ధరణి దగ్గర అన్నం తీసుకొని ఈరోజుకి నేను వడ్డిస్తాను వదినా మీకు ఎందుకు శ్రమ కూర్చుండి అని అందరికీ వడ్డిస్తూ ఉంటాడు.
 

27

అప్పుడు రిషి వసుధారకి వడ్డిస్తున్నప్పుడు దేవయాని ముఖం చిరాకుగా పెడుతుంది. రిషి వసుధార కి ఎక్కువ అన్నం వడ్డించగా, చాల్లేరా నాకు ఆకలేస్తుంది నాకు కొంచెం పెట్టు అని గౌతమ్ అంటాడు.దానికి రిషి, నువ్వు ఆగరా నీది ఎప్పుడూ ఉండేదే కదా పాపం వసుధార, చిన్న ఇంట్లో ఏం తింటుందో ఏంటో అని అంటాడు. దానికి దేవయాని మొఖం చిరాకుగా పెట్టగా అది చూసిన జగతి,మహీంద్ర లు లోపల ఆనందపడతారు. తర్వాత రిషి అందరికీ వడ్డించి జగతి దగ్గరకు వస్తాడు. రిషి, జగతి దగ్గరికి వస్తాడో రాడో అని జగతి కంగారు పడుతూ ఉంటుంది. కానీ రిషి వచ్చి భోజనం వడ్డిస్తాడు. చాల్లేరా ఎక్కువ తినదు జగతి అని మహేంద్ర అనగా, మీరు ఉండండి డాడ్ అసలకే అనారోగ్యంగా ఉన్నారు కదా ఎక్కువ తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది అని జగతికి కావాలని వడ్డిస్తాడు రిషి. తర్వాత అందరూ భోజనం చేస్తూ ఉండగా రిషి మహేంద్రతో, డాడ్ మీరు మేడంని తీసుకొని అలా పిక్నిక్ కి వెళ్లొచ్చు కదా కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అని అనగా, మహేంద్ర మొహమాటంతో సరే అని సిగ్గుపడుతూ అంటాడు. అప్పుడు రిషి, డాడ్ మీ సంతోషమే నా సంతోషం బంధాలు స్వేచ్ఛగా ఎగిరినంత కాలం చాలా బాగుంటాయి కానీ ఒప్పందాలతో బంధించనంత వరకే బాగుంటాయి అని అంటాడు.

37

 దానికి మహేంద్ర మనసులో, నువ్వు గురుదక్షిణ ఒప్పందం గురించి మాతో మాట్లాడుతున్నావని నాకు అర్థమైంది రిషి అని అనుకుంటాడు.ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ హాల్లో కూర్చొని సమావేశం అవుతారు. అప్పుడు గౌతమ్ బొమ్మలుకొలువు గురించి రిషి నీ అడుగుతాడు. దానికి రిషి, చిన్నప్పటినుంచి అందరి పిల్లలతో సంతోషంగా స్నేహం చేస్తూ పండగలు చేసుకుంటే నాకు తెలిసేవిరా కానీ నా బాల్యం అలా లేదు అని అంటాడు. రిషి మాట మార్చడానికి వసు, సర్ ఈ తరం మర్చిపోతున్న కొన్ని పాత సాంప్రదాయాలను గుర్తు చేయాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉన్నది అని అంటుంది.అప్పుడు మహేంద్ర, నువ్వు చెప్పింది సరైనదే వసుధార ఏమంటారు వదిన గారు అని దేవయానిని అడుగుతాడు మహీంద్రా. అప్పుడు రిషి, పెద్దమ్మ పర్మిషన్ లేకపోతే ఇంట్లో ఏ విషయం జరగదు అని అనగా, దేవయాని మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు రిషి, పెద్దమ్మ ఒప్పుకున్నారు కాబట్టి మనం బొమ్మలకొలువు చేద్దామని అంటాడు. అప్పుడు దేవయాని మనసులో, మీరు నన్ను అడగలేదు నేను ఒప్పుకోలేదు మీకు మీరే అనేసుకొని, మీకు మీరే చేసేస్తున్నారు ఇలా ఉంటే నా ఇంటి పెద్ద పోస్ట్ డేంజర్ లో ఉన్నట్టే అని దేవయాని అనుకుంటుంది

47

అప్పుడు రిషితో, రిషి బొమ్మలు కొలువ అంటే కేవలం బొమ్మలు పెట్టడమే కాదు ఇంకా చాలా ఉంటాయి అని అనగా, మీరున్నారు కదా పెద్దమ్మ అన్నీ సంపూర్ణం చేస్తారు అని రిషి అంటాడు. అప్పుడు దేవయాని గౌతమ్ తో, వెనకవైపు బొమ్మలకొలువు కి సంబంధించిన మెట్లు ఉన్నాయి అలాగే ఇంకొన్ని వస్తువులు ఉన్నాయి వాటిని రేపు సద్దంది అని చెప్తుంది. ఆ తర్వాత రోజు ఇంట్లో వాళ్ళందరూ ముస్తాబయి కింద బొమ్మల కొలువు దగ్గర మెట్లను అలంకరించి, పక్కన పువ్వులతో గదిని అందంగా తయారు చేస్తారు. ఇంతలో అక్కడికి మిగిలిన వాళ్ళందరూ వస్తారు. అప్పుడు మహేంద్ర,గౌతమ్ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు గౌతమ్ అందరితో, ఇప్పుడు మనం బొమ్మల కొలువు పెట్టాం కదా ఇప్పుడు ఏం చేస్తాము. బొమ్మలకు అటువైపు ఇటువైపు నుంచుని ఫోటోలు తీసుకొని దాచుకోవడమే కదా అని అనగా, అలా కాదురా పెద్దమ్మ చెప్తారు బొమ్మలు అంటే ఏంటో అని రిషి అంటాడు. ఇంతలో దేవయాని మొదలుపెట్టేలోగా వసుధార పైనుంచి దిగుతూ నేను చెప్తాను అని వస్తుంది. లంగావోని లో వసూ చూసి,రిషి ఎంతో ఆనందపడతాడు. ఇంట్లో వాళ్ల చూపులు కూడా వసుధార మీదే ఉంటాయి. వసుధార కిందకు వచ్చి బొమ్మలకొలువు అంటే కేవలం బొమ్మలు మాత్రమే కాదు సార్.

57

బొమ్మలు కొలువు పెట్టుకొని, కలశం ఏర్పాటు చేసి, పూజ చేసి,దేవుడు విగ్రహాలు పెట్టి నైవేద్యం పెట్టి అని మాట పూర్తి కాక ముందే అది చెప్పడం ఎందుకు వాళ్లే చూస్తారు అని అంటుంది దేవయాని.ఇంతలో దేవయాని, మీరు కూడా వచ్చి సహాయం చేయండి అని అనగా రిషి అవును అందరూ కలిసి చేస్తేనే ఇది బాగా అవుతుంది అని అంటాడు. ఇంతలో వసుధార, అమ్మవారికి పెట్టవలసిన చీర ఎక్కడున్నది మేడం అని ధరణిని అడగా,పైనున్నది చూడు వసుధార అని దాన్ని అంటుంది. అప్పుడు దేవయాని, చెప్పడం కాదు ధరణి వెళ్లి తీసుకురా అని అనగా వద్దు మేడం నేను వెళ్తాను లెండి ఏ రంగు కావాలో, ఏ చీర ఎంచుకోవాలో నేనే చూసుకొని వస్తాను అని వసు బయలుదేరుతుండగా రిషి, ఒకదానివే ఎందుకు ఇక్కడ ఎవరినైనా తోడు తీసుకెళ్ళు అని అంటాడు. అప్పుడు వసు రిషి దగ్గరికి వచ్చి రిషి చేయ పట్టుకుని అందరి ముందు రిషి నీ పైకి తీసుకుని వెళుతుంది.ఆ దృశ్యాన్ని చూసిన అందరూ మనసులో ఆనందపడుతూ ఉండగా దేవయాని మొఖం మాత్రం రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో మహేంద్ర జగతి దగ్గరికి వచ్చి చెవిలో,వీళ్ళిద్దరూ గొడవ వల్ల విడిపోయారు అంటే ఎవరైనా నమ్ముతార?

67

వీళ్ళిద్దరిని చూస్తూ మనిద్దరం వాళ్ళ కోసం తపన పడుతున్నాం కానీ వాళ్ళిద్దరూ బానే ఉన్నారు అని అనుకుంటాడు. దాని తర్వాత రిషి ని వసుధార పైకి తీసుకుని వెళ్తుంది.రిషి మొహమాటంతో అదేంటి అందరి ముందు తీసుకువచ్చేసావు అని అనగా వసుధర చిరునవ్వు ఇస్తుంది. సార్ ఇప్పుడు మీరే చీర ఎంచాలి ముందు మీరు కొన్ని చీరలు ఎంచండి అందులో ఏం బాగున్నదో నేను చూస్తాను అని వసు అంటుంది. ఈ మాత్రం దానికి నువ్వే చేయొచ్చు కదా నన్ను పిలవడం ఎందుకు అని రిషి అనగా, మనం పండగలు పబ్బాలు ఎప్పుడో ఒకసారి చేసుకుంటాను సార్. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ ఫోటోలు చూసి అమ్మవారికి చీర నేనే ఇంచాను అని మీరు అనుకోవాలి కదా సార్ అని వసు అంటుంది. మరోవైపు కింద జగతి, మహీంద్రా, గౌతమ్ బొమ్మలు పెడుతూ ఉండగా దేవయాని, నేను సహాయం చేయనా అని అడుగుతుంది. వద్దు అని జగతి అనగా, నన్ను రిటైర్ చేసేస్తున్నారా మీరు అని దేవయాని అంటుంది. దానికి మహేంద్ర ,మీరు అలా అనొద్దు వదిన గారు రిటైర్మెంట్ కి రిటైర్మెంట్ వచ్చినా మీరు రిటైర్ అవ్వరు అని అంటాడు. అప్పుడు ముగ్గురు కలిపి బొమ్మలు ఉండగా గౌతమ్ జగతి చెవి దగ్గరకు వచ్చి, మేడం పెద్దమ్మ ఒట్టి కుల్లి బటాని కదా అని అంటాడు.

77

 దానికి జగతి,మహేంద్రాలు నవ్వుతారు. ఏమన్నావ్ గౌతమ్ అని దేవయాని అనగా,ఏమీ లేదు పెద్దమ్మ, మీ ఆలోచనలలు, మీ పద్ధతులు చాలా గొప్పగా ఉంటాయి అంటున్నా అని అంటాడు.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడవలసిందే!

click me!

Recommended Stories