పరీక్షలు వస్తున్నాయి కదా జాగ్రత్తగా చదవమని చెప్పండి అని అంటాడు.అప్పుడు జగతి, తను యూత్ ఐకాన్, కాలేజీ గౌరవం కాకుండా కనుక్కోవడం ఒక సగటు ఆడ మనిషి కదా తనకి ఫీలింగ్స్ ఉంటాయి అని అంటుంది జగతి. ఆ తర్వాత సీన్లో, గౌతమ్ వసుతో మాట్లాడి వస్తాడు. మహేంద్ర, వసు ఏమైనా చెప్పిందా అని అడుగుతాడు.మనకు రిషి మనసే కాదు వసుధార మనసు కూడా అర్థం కావట్లేదు అని గౌతమ్ అంటాడు. జగతి అప్పుడే మహేంద్ర దగ్గరికి వస్తుంది. ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే లోగ రిషి, నేను అప్పుడే రాను నాకు పనున్నది మీరు వెళ్ళండి అని అంటాడు.