పూర్ణ హల్దీ ఫంక్షన్‌ ఫోటోలు.. ఎల్లో డ్రెస్‌లో అందాల అప్సరసలా మెరిసిపోతున్న `ఢీ` భామ.. ఫోటోలు వైరల్‌

Published : Nov 01, 2022, 07:41 AM IST

హాట్‌ హీరోయిన్‌, `ఢీ` ఫేమ్‌ పూర్ణ వరుసగా సర్‌ప్రైజ్‌ల మీద సర్ప్రైజ్‌లిస్తుంది. తన మ్యారేజ్‌ విషయాన్నే సస్పెన్స్ ల పెట్టిన ఆమె ఇటీవల వెడ్డింగ్‌ ఫోటోలతో సర్‌ప్రైజ్‌ చేయగా, ఇప్పుడు హల్దీ పిక్స్ తో కనువిందు చేస్తుంది.  

PREV
110
పూర్ణ హల్దీ ఫంక్షన్‌ ఫోటోలు.. ఎల్లో డ్రెస్‌లో అందాల అప్సరసలా మెరిసిపోతున్న `ఢీ` భామ.. ఫోటోలు వైరల్‌

`ఢీ` భామ పూర్ణ(Poorna) ఇటీవల మ్యారేజ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వరుసగా తన మ్యారేజ్‌ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తుంది. ఇటీవల ఆమె షేర్‌ చేసిన పెళ్లి ఫోటోలు వైరల్‌ అయ్యాయి. అభిమానులను, నెటిజన్లని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు హల్దీ ఫోటోలు(Poorna Haldi Photos) వైరల్‌ అవుతున్నాయి. 
 

210

పూర్ణ(Purna) తాజాగా పంచుకున్న హల్దీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో ఆమె ఎల్లో డ్రెస్‌లో హోయలు పోయింది. పార్టీ వేర్‌ లో పూర్ణ అందాలు మరింత రెట్టింపు కావడం విశేషం. అంతేకాదు హల్దీ లుక్‌లో అందాల అప్సరసలా ఉంది పూర్ణ. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట హల్ చల్‌ చేస్తున్నాయి. అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 
 

310

పూర్ణ దుబాయి బేస్డ్ ఇండియాకి చెందిన వ్యాపారవేత్త షానిద్‌ అసిఫ్‌ అలీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మే 31న వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని, జూన్‌ 12న వివాహం చేసుకున్నట్టు ఇటీవల పూర్ణ వెల్లడించి షాకిచ్చారు. ఆ వెంటనే దీపావళి కానుకగా ఆమె తన మ్యారేజ్‌ ఫోటోలను పంచుకున్నారు. 
 

410

వారం గ్యాప్‌తో ఇప్పుడు సోమవారం తన హల్దీ ఫంక్షన్‌ పిక్స్ ని షేర్‌ చేసింది. ఇందులో కొంటె చూపులు, చిలిపి నవ్వులు, పెళ్లికళ ఉట్టిపడేలా ఉన్న ఆమె ఫోటోలను పంచుకోగా అవి ఆద్యంతం ఆకట్టుకుంటూ ట్రెండ్‌ అవుతున్నాయి.

510

హీరోయిన్‌గా కెరీర్‌ని ప్రారంభించిన పూర్ణ, క్రమంగా బోల్డ్ అండ్‌ హాట్‌ రోల్స్ లో మెప్పించింది. `అవును` చిత్రం ఆమెకి విశేషం గుర్తింపుని తీసుకొచ్చింది. ఇందులో ఆమె పాత్ర ఇంటెన్స్ గా,బోల్డ్ గా ఉన్న విషయం తెలిసిందే. తన హాట్‌ అందాలకు ఆ పాత్ర మరింత పండింది. చీరలో పిచ్చెక్కించింది. 
 

610

దీంతో పూర్ణకి వరుసగా అలాంటి పాత్రలే క్యూ కట్టాయి. కొన్ని అలాంటి పాత్రలే చేసింది. దీంతో పూర్ణ అక్కడికే పరిమితమైంది. అయితే ఆమె కమర్షియల్‌ హీరోయిన్ల పాత్రలకు సెట్‌ కాదనే ఉద్దేశంతో మేకర్స్ ఈ బ్యూటీని పట్టించుకోలేదు. దీంతో చిన్న బడ్జెట్‌ చిత్రాలకు, ఓ మోస్తారు బడ్జెట్‌ చిత్రాలకే పరిమితమైంది పూర్ణ. 
 

710

మరోవైపు హీరోయిన్‌గా కొన్ని డిఫరెంట్‌ రోల్స్ వచ్చాయి. వస్తున్నాయి. కానీ ఒకానొక సందర్భంలో పూర్ణ ఫేడౌటా? అనే టాక్‌ కూడా స్టార్ట్ అయ్యింది. అంతలోనే `ఢీ`షో ఆమెకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. ఈ డాన్సు షోకి పూర్ణ జడ్జ్ గా చేసి మెప్పించింది. దీంతో మంచి అవకాశాలు కూడా స్టార్ట్ అయ్యాయి. 

810

ఇటీవల `అఖండ`, `దృశ్యం2`, `తలైవి` చిత్రాల్లో కీలక పాత్రల్లో మెరిసింది పూర్ణ. దీంతో మరోసారి పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంది. ఇలా ఆమెకి మరిన్ని అవకాశాలు క్యూ కట్టాయి. అయితే ఇంతలోనే ఆమె మ్యారేజ్‌ చేసుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే మ్యారేజ్‌ తర్వాత కూడా తను నటిగా కొనసాగుతుందని తెలుస్తుంది.
 

910

ఇటీవల ఆమె తన నోట్‌లోనే తన పనిని గౌరవిస్తూ ప్రోత్సహిస్తున్నందుకుధన్యవాదాలు చెప్పింది ఆమె భర్తకి. అంటే పూర్ణ ఎప్పటిలాగే కొన్నాళ్లపాటు నటిగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అరడజను సినిమాలతోపాటు `ఢీ` షోకి జడ్జ్ గా చేస్తున్న విషయం తెలిసిందే. 
 

1010

`ఢీ` ఫేమ్‌ పూర్ణ వరుసగా సర్‌ప్రైజ్‌ల మీద సర్ప్రైజ్‌లిస్తుంది. తన మ్యారేజ్‌ విషయాన్నే సస్పెన్స్ ల పెట్టిన ఆమె ఇటీవల వెడ్డింగ్‌ ఫోటోలతో సర్‌ప్రైజ్‌ చేయగా, ఇప్పుడు హల్దీ పిక్స్ తో కనువిందు చేస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories