Good Bad Ugly 3 Days Collections
Good Bad Ugly 3 Days Collections: అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ `గుడ్ బ్యాడ్ అగ్లీ`. ఈ చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఇందులో అజిత్ భార్యగా త్రిష నటించింది.
ఈ చిత్రంలో ప్రసన్న, సునీల్, రెడిన్ కింగ్స్లీ, ప్రియా వారియర్, అర్జున్ దాస్, ప్రభు, సిమ్రాన్ వంటి భారీ తారాగణం నటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్
అజిత్ మాస్ విందు
`గుడ్ బ్యాడ్ అగ్లీ` చిత్రం భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10న విడుదలైంది. కొడుకును కాపాడుకునే గ్యాంగ్‌స్టర్ తండ్రి కథే ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ. పాత కథే అయినా అజిత్ అభిమానులను సంతృప్తి పరిచే విధంగా సినిమా నిండా మాస్ సన్నివేశాలు, బిల్డప్‌లతో విందు భోజనం వడ్డించారు ఆదిక్.
ఫ్యాన్స్ కి కావాల్సిన ఎలిమెంట్లని జోడించారు, పైగా వింటేజ్ అజిత్‌ని చూపించారు. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇది ఫస్ట్ డే నుంచి మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. పెద్ద హిట్ దిశగా వెళ్తుంది.
గుడ్ బ్యాడ్ అగ్లీ బాక్సాఫీస్
గుడ్ బ్యాడ్ అగ్లీ 100 కోట్ల వసూళ్లు
`గుడ్ బ్యాడ్ అగ్లీ` చిత్రం విడుదలైన మొదటి రోజే తమిళనాడులో రూ.30 కోట్లు వసూలు చేసి కొత్త చరిత్ర సృష్టించింది. మొదటి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.78.5 కోట్లు వసూలు చేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ, మూడో రోజు ముగిసే సమయానికి 100 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.
ఈ ఏడాది 100 కోట్లు వసూలు చేసిన మూడో తమిళ చిత్రంగా `గుడ్ బ్యాడ్ అగ్లీ` నిలిచింది. దీనికి ముందు `విడాముయార్చి`, `డ్రాగన్` సినిమాలు ఈ ఘనత సాధించాయి. అంతేకాకుండా ఈ ఏడాది అత్యంత వేగంగా 100 కోట్లు వసూలు చేసిన చిత్రంగా `గుడ్ బ్యాడ్ అగ్లీ` నిలవడం విశేషం. ం. ఈరోజు సెలవు దినం కావడంతో గుడ్ బ్యాడ్ అగ్లీ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.