హిట్స్, ప్లాప్స్తో సంబంధం లేని ఇమేజ్..
అనన్య ఇప్పటివరకు దాదాపు 12 చిత్రాలలో నటించారు. అయితే, బాక్సాఫీస్ లెక్కల ప్రకారం చూస్తే వీటిలో మెజారిటీ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. కేవలం రెండు సినిమాలు మాత్రమే మంచి విజయాన్ని అందుకున్నాయి. అయినప్పటికీ, ఆమె నటనపై.. నటిగా ఆమెకున్న ఇమేజ్ పై ఈ ఫలితాలు ఎలాంటి నెగెటీవ్ ప్రభావం పడలేదు. ఓటమి ఎదురైనా నిరాశచెందకుండా, పాత్రల ఎంపికలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ విభిన్నమైన జోనర్లను ప్రయత్నిస్తున్నారు.
సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా అనన్య సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటారు. తరచూ తన గ్లామరస్, ట్రెడిషనల్ ఫొటోలు, వ్యక్తిగత విశేషాలను అభిమానులతో పంచుకుంటూ నెట్టింట ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటారు. ఈ రకంగా డిజిటల్ మాధ్యమంలో కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్గా మారారు. ఫలితాల కంటే కంటెంట్కే ప్రాధాన్యమిస్తూ, కొత్త అవకాశాలను అందుకుంటూ టాలీవుడ్లో తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.