Venkatesh కోసం హీరోయిన్‌ ని సెట్‌ చేసిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా? ఐశ్వర్యా రాయ్‌కి పెద్ద షాక్‌

Published : Dec 15, 2025, 08:00 PM IST

వెంకటేష్‌ హీరోగా రూపొందిన `ప్రేమంటే ఇదేరా` మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అయితే ఇందులో హీరోయిన్‌ని బాలీవుడ్‌ స్టార్‌ హీరో సెట్‌ చేశాడట. ఆ కథేంటో చూద్దాం. 

PREV
15
ఏకే 47తో రాబోతున్న వెంకటేష్‌

విక్టరీ వెంకటేష్‌  అప్పట్లో అత్యంత సక్సెస్‌ ఫుల్‌ హీరోగా రాణించారు. కానీ ఇటీవల కాలంలో వరుస పరాజయాలను ఎదుర్కొన్నారు. అయితే ఈ ఏడాది `సంక్రాంతికి వస్తున్నాం` మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ని అందుకున్నారు. ఈ ఏడాది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందీ మూవీ. ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా వెళ్తున్నారు వెంకీ. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్‌ దర్శకత్వంలో `ఆదర్శ కుటుంబం`(ఏకే47) చిత్రంలో నటిస్తున్నారు.

25
`ప్రేమంటే ఇదేరా` రీ రిలీజ్‌ వాయిదా

ఇదిలా ఉంటే వెంకటేష్‌ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ `ప్రేమంటే ఇదేరా`ని రీ రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ వాయిదా వేశారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు జయంత్‌ సీ పరాన్జీ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇందులో వెంకటేష్‌కి జోడీగా ప్రీతి జింటా హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఆమెకంటే ముందు చాలా మంది హీరోయిన్లని అనుకున్నారు. అందులో ఐశ్వర్యా రాయ్‌ని తీసుకోవాలనుకున్నారు. ఆమెకి కథ నచ్చింది. ఓకే చేసింది. ఆ తర్వాత హ్యాండించింది.

35
హీరోయిన్‌ కోసం దర్శకుడు జయంత్‌ సీ పరాన్జీ ఆందోళన

దీంతో మళ్లీ హీరోయిన్‌ కోసం కష్టాలు తప్పలేదు. ఓ దశలో రేణు దేశాయ్‌ ని కూడా ఆడిషన్‌ చేశారు. అయినా సెట్‌ కాలేదు, నలుగురు ఐదుగురు హీరోయిన్లని అనుకున్నారు. వర్కౌట్‌ కాలేదు.  దీంతో దర్శకుడు జయంత్‌ సీ పరాన్జీకి ఏం చేయాలో తోచలేదు. అప్పటికే సినిమా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఇంకా మూడు రోజుల్లోనే ప్రారంభం ఉంది. ఇంకా హీరోయిన్‌ సెట్‌ కాలేదు, రాజీపడుతున్నామా అనే సందేహం దర్శకుడిలో ఉంది. ఏం తోచని స్థితిలో ఆయన రామానాయుడు స్టూడియోలో చెట్టుకింద కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో ఓ కార్ ఆయన ముందు వచ్చి ఆగిందట.

45
వెంకీ కోసం హీరోయిన్‌ని సెట్‌ చేసిన అనిల్‌ కపూర్‌

దర్శకుడు జయంత్‌ ముందు ఆగిన కారు బాలీవుడ్‌ స్టార్‌ హీరో అనిల్‌ కపూర్‌ది. ఆయన దిగి ఏంటి జయంత్‌, ఏదో బాధలో ఉన్నావని పలకరించారట. దీంతో అసలు విషయం చెప్పాడు దర్శకుడు. అరే అంత టెన్షన్‌ ఎందుకు, లిరిల్‌ యాడ్‌ అమ్మాయిని చూశావా?, ఆ అమ్మాయిని ఎందుకు తీసుకోకూడదని చెప్పాడట. జయంత్‌కి ఐడియా నచ్చింది. ఓకే చెప్పాడు. అనిల్‌ కపూర్‌ వెంటనే మేనేజర్‌కి ఫోన్‌ చేసి ఆ అమ్మాయి డిటెయిల్స్ కనుకున్నారు. మీటింగ్‌ అరెంజ్‌ చేశాడు. నెక్ట్స్ డేనే జయంత్‌ ముంబయికి వెళ్లాడు. అక్కడ ప్రీతి ఏదో యాడ్‌ షూట్‌లో ఉంది. చూడటం, నచ్చడం, ఓకే చేయడం వెంటవెంటనే జరిగిపోయిందట.

55
ఐశ్వర్య రాయ్‌కి పెద్ద షాక్‌

అలా అనిల్‌ కపూర్‌ వల్ల `ప్రేమంటే ఇదేరా` మూవీలో వెంకటేష్‌ సరసన హీరోయిన్‌గా ప్రీతి జింటా సెట్‌ అయ్యింది. ఈ మూవీ అద్భుతమైన లవ్‌ స్టోరీగా రూపొంది బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే స్టార్‌ అయిపోయింది ప్రీతి. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి పెద్ద స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. ఈ సినిమా విజయాన్ని చూసి ఆ తర్వాత ఐశ్వర్య రియలైజ్‌ అయ్యిందట. అయితే ఐష్‌ ఈ మూవీ రిజెక్ట్ చేయడానికి కారణం అప్పుడే హిందీలో చేసిన సినిమాలు ఆడలేదు. ఆ బాధలో ఈ మూవీని రిజెక్ట్ చేసిందట. ఆమె నో చెప్పడంతో ఆ ఛాన్స్ ప్రీతికి వెళ్లింది, ఆమె లైఫే మారిపోయింది. ఇది ఓ రకంగా ఐష్‌కి పెద్ద షాక్‌ అనే చెప్పాలి.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories