ఏమైందో ఏమో కానీ బిగ్ బాస్ 5 ముగిశాక సునైనా, షణ్ముఖ్ గురించి రూమర్స్ ఎక్కువయ్యాయి. త్వరలో వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ ఊహాగానాలు సోషల్ మీడియా ఎక్కువయ్యాయి. దీనికి తోడు దీప్తి సునైనా కూడా 'మార్పు అవసరం' అంటూ పరోక్షంగా హింట్స్ ఇస్తూ వచ్చింది. నిన్న డిసెంబర్ 31న అభిమానులు ఊహించిందే జరిగింది. షణ్ముఖ్ తో విడిపోతున్నట్లు దీప్తి సునైనా సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. దీనితో అటు షణ్ముఖ్ ఫ్యాన్స్, ఇటు సునైనా ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు.