మరి ఇది నిజం అయితే పూజా ప్లేస్ లో ఎవరిని హీరోయిన్ గా తీసుకుంటారు అన్న ప్రశ్నకు సమంత పేరు సమాధానంగా వినిపిస్తుంది. ఈసినిమాలో మహేష్ జోడీగా సమంతను తీసుకోవాలి అని అనుకుంటున్నాడట త్రివక్రమ్ శ్రీనివాస్. మహేష్ సమంత కాంబినేషన్ లో దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం సినిమాలు వచ్చాయి. త్రివిక్రమ్ – సమంత కాంబోలో అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలు చేసింది. తనకు లక్కీ హీరోయి అవ్వడంతో మహేష్ కు జతగా సమంతను తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్.