స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌ హాట్‌ అందాలతో ఢీ భామ రచ్చ.. పిల్లి కాదు, పులి అంటోన్న స్టార్ డైరెక్టర్‌

Published : Aug 15, 2022, 01:40 PM ISTUpdated : Aug 16, 2022, 03:05 PM IST

`ఢీ` బ్యూటీ దీపికా పిల్లి.. క్యూట్‌ అందాలతో ఇంటర్నెట్‌లో సైలెంట్‌గా కాకరేపుతుంది. దీపికా పిల్లి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. అందుకు రెండు ఇంట్రెస్టింగ్‌ కారణాలుండటం విశేషం.   

PREV
110
స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌ హాట్‌ అందాలతో ఢీ భామ రచ్చ.. పిల్లి కాదు, పులి అంటోన్న స్టార్ డైరెక్టర్‌

దీపికా పిల్లి(Deepika Pilli) ట్రెండీ వేర్‌లో ఇప్పుడు మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. నెట్టింట అలజడి క్రియేట్‌ చేస్తుంది. ప్రస్తుతం ఆమె గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కొంటె చూపులు, హాట్‌ పోజులతో మతిపోగొట్టేలా ఉంది దీపికా పిల్లి. 

210

టిక్‌ టాక్‌ నుంచి `ఢీ` షోకి, అట్నుంచి కామెడీ షోకి, ఇప్పుడు ఏకంగా ఓ హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అవుతుంది. ప్రస్తుతం ఆమె `వాంటెడ్‌ పండుగాడ్‌` (Wanted PanduGod)చిత్రంలో నటించింది. ఈ సినిమా ఆగస్ట్ 19న విడుదల కాబోతుంది. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి నటించిన దీపికా పిల్లి. ఆమెతోపాటు అనసూయ, సునీల్‌, శ్రీనివాస్‌రెడ్డి వంటి చాలా మంది కామెడీ ఆర్టిస్టులున్నారు. 

310

కె.రాఘవేంద్రరావు సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీధర్‌ సీపాన దర్శకుడు. ఈ చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఆదివారం రాత్రి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది దీపికా పిల్లి. అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. Deepika Pilli Hot Photos.

410

ఇందులో థిక్‌ గ్రీన్‌ కలర్‌ డ్రెస్‌లో మెరిసింది. ట్రెండీ వేర్‌ ధరించి హోయలు పోయింది. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌లో కనువిందు చేస్తుంది. కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. ఈ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండటం విశేషం. దీపికా పిల్లి ఓ రకంగా హాట్‌ యాంకర్‌ అనసూయని, మరో యంగ్‌సెన్సేషన్‌ శ్రీలీలాని సైతం డామినేట్‌ చేయడం విశేషం. 

510

ఈ ఈవెంట్‌లో దీపికా పిల్లిపై స్టార్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ ప్రశంసలు కురిపించారు. దీపికా పిల్లి అద్భుతంగా నటిస్తుందని తెలిపారు. తనకు ఈ చిత్రం మంచి బ్రేక్‌ ఇవ్వాలని కోరుకున్నారు. అంతేకాదు దీపికా పిల్లి కాదు, ఆమె పులి అని, కెమెరా ముందుకొచ్చిందంటే అద్భుతంగా చేస్తుందని ప్రశంసించారు. 

610

మరోవైపు దీపికా పిల్లి సైతం తన ఆనందాన్ని షేర్‌ చేసుకుంది. రాఘవేంద్రరావు వంటి పెద్ద దర్శకుడిగా సమక్షంలో నటించడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ఈ చిత్రంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపింది. తన పాత్ర అందరిని ఆకట్టుకునేలా ఉంటుందని పేర్కొంది. 
 

710

`పండుగాడు` అనే క్రిమినల్‌ని పట్టుకుంటే కోటి రూపాయలు గెలుచుకోవచ్చనే కథాంశంతో ఈ చిత్రాన్ని ఆద్యంతం కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఇందులో సుడిగాలి సుధీర్‌, దీపికా పిల్లి జంటగా నటించారు. వీరిద్దరికి సంబంధించి డ్యూయెట్లు కూడా ఉండటం విశేషం. ఈ సినిమా హిట్‌ అయితే దీపికా దశ తిరిగిపోయినట్టే అని చెప్పొచ్చు. 

810

అయితే లేటెస్ట్ లుక్‌లో మాత్రం దీపికా పిల్లి మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. తరచూ దీపికా పిల్లి ట్రెండీ వేర్‌లో మెరుస్తుంది. గ్లామర్‌ ఫోటోలు పంచుకుంటూ నెమ్మదిగా తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అందరి చూపులు తనవైపు తిప్పుకునేలా చేస్తుంది. 

910

దీపికా పిల్లికి `టిక్‌ టాక్‌` లైఫ్‌ ఇచ్చింది. దీనితో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ షార్ట్ ఫిల్మ్స్, యాంకర్‌గా, చిన్న చిన్న పాత్రల కోసం ప్రయత్నించింది. ఇంతలో ఆమెకి `ఢీ` షోలో ఛాన్స్ దక్కింది. దీంతో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది. ఇందులో హైపర్‌ ఆదితో కలిసి సందడి చేసింది. 

1010

`ఢీ` నుంచి తప్పుకున్నాక కొంత కాలంపాటు ఖాళీగానే ఉన్న ఈ భామ కామెడీ స్టార్స్ లో మెరుస్తుంది. మరోవైపు సినిమాల ఛాన్స్ ల కోసం వెయిటింగ్‌లో ఉంది. మరి ఈ బ్యూటీ కెరీర్‌ ఎటువైపుగా టర్న్ తీసుకుంటుందో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories