ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.... గోవిందరాజు, మల్లిక దాచి పెట్టిన ప్లేట్ ని చూస్తాడు.ఇదా సంగతి అని అనుకుంటాడు. ఏ అమ్మ మల్లికా మౌనవ్రతమా అని అడగగా మల్లికా అవును అని బుర్ర ఊపుతుంది. అప్పుడు గోవిందరాజు,నీ మెడలో చైన్ లేదు ఏమైంది అమ్మ? అని అనగా మల్లికా కంగారుగా ప్లేట్ ని టేబుల్ మీద పెట్టి నా చైన్ అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు జ్ఞానాంబ అన్నం ప్లేట్ ని చూసి, నేను తిండి తినొద్దు అన్నంత దుర్మార్గురాల్ని కాదు. నువ్వు ఇంకెప్పుడు మాంసం తినకూడదని ఇలా చెప్పాను.ఇంటికి వచ్చిన వెంటనే తినమని చెబుదామనుకున్నాను కానీ నువ్వు నా మాట వినలేదు.