అద్భుతమైన మౌత్ టాక్ తో రోజు రోజుకి వసూళ్లు పెరుగుతున్నాయి. దీనితో కార్తికేయ 2 ప్రదర్శించే థియేటర్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 3.5 కోట్ల షేర్ రాబట్టింది. క్రిటిక్స్ అద్భుతమైన రివ్యూస్, ఆడియన్స్ పాజిటివ్ రెస్పాన్స్ కారణంగా ఫస్ట్ డేని మించేలా సెకండ్ డే బాక్సాఫీస్ వద్ద రచ్చ జరిగింది.