దీపికా పదుకొనె బనారస్ చీర తయారీకి 6 నెలలా? అంత ప్రత్యేకత ఏంటి..?

First Published | Sep 7, 2024, 6:03 PM IST

ఇటీవల సిద్ధివినాయక ఆలయంలో దీపికా పదుకొణె పచ్చని రంగులో మెరిసే చీరలో కనిపించింది. ఆరు గజాల అందమైన ఈ చీర అందరిని ఆకట్టుకుంటుంది.  ఈ చీరను ప్రముఖ డిజైనర్ ఒకరు త్వరలో తల్లి కాబోతున్న దీపికకు బహుమతిగా ఇచ్చారు.

సిద్ధివినాయక ఆలయంలో తన భర్త రణ్వీర్ సింగ్ తో కలిసి దీపికా పదుకొణె పచ్చని బనారస్ చీరలో మెరిసిపోయింది. బంగారు రంగు అంచుతో పాటు పల్లూలోని అందమైన టసెల్స్ ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా ఈ చీరను బనారసి బైఠక్ బ్రాండ్ నుండి నటికి బహుమతిగా అందించారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దీపికా పదుకొణె ధరించిన ఆకుపచ్చ బనారస్ చీర గురించి బనారసి బైఠక్ కొన్ని విషయాలను వెల్లడించింది. వందేళ్లకు  పూర్వం ఉన్న ఆకుపచ్చ బనారస్ చీరకు కాపీగా తీసుకుని.. ఈ చీర తయారు చేసినట్టు వెల్లడించారు.  బెనారస్ కు చెందిన అతి నైపుణ్యం కలిగిన నేత చేతిలో తయారైన ఈ చీరలో బూటా మోటిఫ్స్ ఉన్నాయి.

సర్వేపల్లి రాధాకృష్ణన్ తో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా..?

Latest Videos


ఈ బనారస్ చీర తయారీకి ఆరు నెలల సమయం పట్టిందని, చీరను కత్తిరించకుండా 'ఎప్పటికీ నిలిచిపోయేది'గా ఉండేలా అనైతా ష్రాఫ్ అడజానియా చూసుకున్నారని తెలిసింది. చీర యొక్క అందమైన రంగు దీపిక కు కలిగే  సంతానానికి శుభ సూచికంగా నిలిచింది. ఈచీర  తల్లి కాబోతున్న దీపిక అందాన్ని మరింతగా పెంచిందని చెప్పవచ్చు.

1000 రోజులు ఆడిన బాలయ్య ఏకైక సినిమా ఏదో తెలుసా

click me!