లేటెస్ట్ సర్వే లో షాకింగ్ రిజల్ట్... ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

First Published | Sep 7, 2024, 5:06 PM IST


బిగ్ బాస్ సీజన్ 8 మొదటి ఎలిమినేషన్ కి సమయం ఆసన్నమైంది.. ఎలిమినేషన్ లిస్ట్ లో ఆరుగురు ఉండగా తాజా సర్వే లో షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి. 

Bigg Boss Telugu 8

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫస్ట్ వీక్ నామినేషన్స్ సుదీర్ఘంగా సాగాయి. ఎట్టకేలకు ఈ ప్రక్రియ ముగిసింది. టాప్ కంటెస్టెంట్స్ నామినేషన్ లో ఉండటం విశేషం. టైటిల్ ఫేవరెట్ తో పాపులారిటీ కలిగిన కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ లిస్ట్ లో చేరారు. మొత్తంగా ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ కాగా... ఒకరు వచ్చే ఆదివారం ఇంటిని వీడనున్నారు. 

నామినేషన్స్ అంటేనే హౌస్ హీటెక్కుతోంది. కంటెస్టెంట్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. సీజన్ 8 సెప్టెంబర్ 1న ప్రారంభం కాగా... ఒక్క వారం కూడా గడవ లేదు. అయినప్పటికీ కంటెస్టెంట్స్ ఒకరిని ఇంకొకరు తప్పుబడుతున్నారు. లోపాలు వెదుకుతున్నారు. తప్పక మనసొప్పక కూడా ఈ పని చేయాల్సి ఉంటుంది. 

Bigg boss telugu 8


నామినేషన్స్ డే వచ్చిందంటే ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు కంటెస్టెంట్స్ ని కారణాలు చెప్పి నామినేట్ చేయాల్సి ఉంటుంది. హౌస్లో ఉన్న 14 మంది కంటెస్టెంట్స్ ఇద్దరు చొప్పున నామినేట్ చేశారు. చీఫ్స్ గా ఉన్న నిఖిల్, యాష్మి, నైనికలకు మినహాయింపు దక్కింది. 


మిగిలిన 11 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ ప్రక్రియ లోకి వచ్చారు. పాపులారిటీ ఉన్న 6 కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వీరిలో టైటిల్ ఫేవరేట్ ఉండటం విశేషం. సోషల్ మీడియా స్టార్ బేబక్క, శేఖర్ బాషా, సోనియా ఆకుల, విష్ణుప్రియ, నాగ మణికంఠ, పృథ్విరాజ్ నామినేషన్స్ లిస్ట్ లో ఉన్నారు. 

కాగా విష్ణుప్రియ టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగింది. మిగతా కంటెస్టెంట్స్ తో పోల్చుకుంటే ఆమె ఫార్మ్ లో ఉన్నారు. బుల్లితెర ప్రేక్షకుల్లో విష్ణుప్రియకు భారీ ఇమేజ్ ఉంది. సోషల్ మీడియా జనాలు సైతం ఆమెను ఫాలో అవుతూ ఉంటారు. ఈ సీజన్ కి గాను విష్ణుప్రియ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ అనే ప్రచారం కూడా ఉంది. 

Bigg Boss Telugu Season 8

విష్ణుప్రియ నామినేట్ అయినప్పటికీ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. నాగ మణికంఠ తక్కువ సమయంలో ఎక్కువ ఫోకస్ అయ్యాడు. పృథ్విరాజ్ హ్యాండ్ సమ్ తెలుగు సీరియల్ హీరో. అతడు షోకి ప్లస్ అవుతాడని మేకర్స్ భావిస్తారు. సోనియా ఆకుల గ్లామర్ క్వీన్, ఇక శేఖర్ బాషా వివాదాలతో ఫేమస్ అయిన ఆర్జే. 

తాజాగా ఓటింగ్ సరళి చూస్తే.. విష్ణుప్రియకు అధికంగా ఓట్లు పోల్ అయ్యాయట. నలబై శాతానికి పైగా ఓట్లు ఆమెకు పడ్డాయట. సెకండ్ ప్లేస్ లో నాగ మణికంఠ ఉన్నాడట. అతడు సింపతీ గేమ్ ఆడుతున్నాడని ట్రోల్స్ కి గురైనప్పటికీ అతడికి ఓట్లు బాగా పోల్ అవుతున్నాయట. 

Bigg Boss Telugu Season 8

పృథ్విరాజ్ మూడో స్థానంలో ఉన్నాడట. చివరి మూడు స్థానాల్లో శేఖర్ బాషా, బెజవాడ బేబక్క, సోనియా ఆకుల ఉన్నారట. ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారట. ఆదివారం దీనిపై స్పష్టత రానుంది.

Latest Videos

click me!