మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా సెకండ్ సింగిల్‌ను ఈనెలలోనే రిలీజ్ చేస్తామని టీమ్ అఫీషియల్ గా రిలీజ్ చేసింది. రామ్ చరణ్ డాన్స్ చేస్తున్నట్టు ఉన్న ఓ పోస్టర్‌ను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో చరణ్ తలకి ఎర్ర కండువా కట్టుకుని కనిపించారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ గతంలో రిలీజ్ చేశారు. ఈనెలలో రెండు సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. రెండో సాంగ్ కోసం రాంచరణ్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. చాలా కాలంగా గేమ్ ఛేంజర్ నుంచి ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదు. దాంతో చరణ్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి