బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 8న ప్రారంభం అయింది. తొలివారం చివరి దశకు చేరుకుంది. అయితే బిగ్ బాస్ తెలుగు 8పై ముందు నుంచి అంత బజ్ లేదు. దానికి కారణం ఎంపిక చేసిన కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. గత సీజన్ లో అయితే శివాజీ, అమర్ దీప్, శోభా శెట్టి ఇలా కొంత మంది ఆడియన్స్ కి బాగా తెలిసిన సెలెబ్రిటీలు కనిపించారు. ఫలితంగా షోపై ఆసక్తి పెరిగింది.