పవన్ కళ్యాణ్ ‌- దీపిక పదుకొనే కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా, డేట్స్ ఇచ్చి తప్పుకున్న హీరోయిన్ ..?

First Published | Oct 20, 2024, 5:15 PM IST

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే తప్పుకుందట. కారణంఏటో తెలుసా..? ఇంతకీ ఆ సినిమా ఏంటి..? 

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఎంతో మంది హీరోయిన్లతో పనిచేశారు. అందులో బాలీవుడ్ బ్యూటీస్ కూడా ఉన్నారు. అయితే ఒక్క బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాత్రం ఆయన సినిమాకు డేట్లు ఇచ్చి ఆతరువాత తప్పుకుందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు దీపికా పదుకునే. 

ఈమెపవన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. ఆతరువాత ఎందుకు తప్పుకుందంటే.? పవన్ కళ్యాణ్ చాలా సినిమాలు మిస్ అయ్యాడు. హిట్ సినిమా కథలను కూడా రిజెక్ట్ చేశారు. ఆయన పూరీ జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఎక్కువ సినిమాలు చేశారు. తన సినిమా వల్ల నిర్మాత నష్టపోతే ఆదుకున్నారు. 
 


ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్నారు పవన్.  పూరీ జగన్నాథ్ హిట్ సినిమాలైన ఇడియట్, అమ్మా నాన్న ఓతమిళ్ అమ్మాయి లాంటి సినిమాలు పవన్ చేయాల్సిందిగా పూరీ అడిగారట. కాని ఆ కథలు నచ్చక  పవన్ రిజెక్ట్ చేశారట. దాంతో ఆ సినిమాలు ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే. 

కాగా..పవన్ కళ్యాన్ చేసిన ఓ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే ను తీసుకోవాలి అని అనుకున్నారట.   ఆసినిమా ఏదో కాదు తీన్ మార్. అవును ఈసనిిమ హిందీ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు. అయితే ఈసినిమాకోసం నిర్మాత బండ్లగణేష్ దీపికాను తీసుకోవడానికి డేట్లు కూడా ఇచ్చేశారట. అయితే ఎందుకో తెలియదు ఈసినిమా షూటింగ్ లేట్ అయ్యింది. 
 

దాంతో అప్పటికే దీపికా డేట్లు అయిపోవడం.. ఆమె వేరే సినిమాలో బాలీవుడ్ లో బిజీ అయిపోవడంతో.. దీపికా ఈసినిమా నుంచి తప్పుకుందట. అలాగే ఈ  ప్రాపెక్ట్ లోకి త్రిష వచ్చి చేరింది. ఇక ఈమూవీ కమర్షియల్ హిట్ కాకపోయినా.. సినిమాకు డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రేమికులు ఈసినిమాను బాగా ఆదరించారు. 
 

ఇప్పటికీ ఈసినిమా రీరిలీజ్ చేస్తే.. బారీ ఎత్తున రెస్పాన్స్ తో పాటు కలెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈవిధంగానే నిర్మాత బండ్లగణేష్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేడిప్యూటీ సీఎంగాఫుల్ బిజీగా ఉన్నారు. అంతే కాదు ఎలక్షన్స్ కు ముందు తాను పెండింగ్ పెట్టినటువంటి మూడు సినిమాల షూటింగ్స్ ను ఆయన కంప్లీట్ చేసే నిలో ఉన్నారు.  

Latest Videos

click me!