బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ అలెర్ట్ అయ్యారు. బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ని కూడా చంపేస్తాం అంటూ ముంబై పోలీసులకే బెదిరింపులు పంపింది. 1998లో సల్మాన్ ఖాన్ రాజస్థాన్ లో కృష్ణ జింకని వేటాడిన సంగతి తెలిసిందే. ఆ వివాదం సల్మాన్ ఖాన్ ని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఒకవైపు కోర్టు కేసు మరోవైపు బిష్ణోయ్ ల బెదిరింపులతో సల్మాన్ ఖాన్ ప్రశాంతత కోల్పోతున్నాడు.