నాగార్జున ముందే హౌస్ మొత్తం మణికంఠకి వెన్నుపోటు, ముగ్గురు తప్ప.. ఎలిమినేషన్ లో జరిగింది ఇదే.. 

First Published | Oct 20, 2024, 4:38 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 8లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించని విధంగా ఎలిమినేషన్ ప్రక్రియ సాగుతోంది. తొలిరోజు నుంచి నాగ మణికంఠ హైలైట్ అవుతూ వస్తున్నాడు.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 8లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించని విధంగా ఎలిమినేషన్ ప్రక్రియ సాగుతోంది. తొలిరోజు నుంచి నాగ మణికంఠ హైలైట్ అవుతూ వస్తున్నాడు. అతడికి స్క్రీన్ స్పేస్ దక్కుతోంది కానీ ఇతర కంటెస్టెంట్స్ పోటీలో వెనుకబడుతూ వస్తున్నాడు. ఎలాగోలా 49 రోజులు నెట్టుకొనొచ్చాడు. 

కానీ చివరకి సండే రోజు అతడి ఎలిమినేషన్ కంఫర్మ్ అయింది. మణికంఠ మాటలు, మాటిమాటికి ఏడవడం ఎమోషనల్ అవ్వడం లాంటి సన్నివేశాలు మీమ్స్ రూపంలో బాగా వైరల్ అయ్యాయి. మణికంఠకి నెగిటివ్ గా అయినా పబ్లిసిటీ లభిస్తూ వచ్చింది. ఈ క్రమంలో యాష్మి, పృథ్వీ లాంటి వాళ్ళు మణికంఠకి బద్ద శత్రువులుగా మారారు. మణికంఠ ఈవారం నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో కూడా మణికంఠ నామినేషన్స్ లోకి వచ్చి సేఫ్ అయ్యాడు. కానీ ఈసారి తక్కువ ఓటింగ్ తో మణికంఠ డేంజర్ జోన్ లో ఉన్నాడు. 


స్వల్ప తేడాతో అయినా మణికంఠ బయటపడతాడు అని అనుకున్నారు. అలా జరగలేదు. మణికంఠ సండే ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యారనేది కంఫర్మ్. నిఖిల్‌, పృథ్వీరాజ్‌, యష్మి, హరితేజ, మణికంఠ, నబీల్‌, గౌతమ్‌, ప్రేరణ, టేస్టీ తేజ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో మణికంఠ, టేస్టీ తేజ, గౌతమ్ లకు తక్కువ ఓటింగ్ ఉంది. మణికంఠ, టేస్టీ తేజ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వొచ్చు అనే ఊహాగానాలు వినిపించాయి. 

కానీ అంతా అనుకున్నట్లు కాకుండా టేస్టీ తేజ ముందుగానే సేవ్ అయ్యాడు. చివరికి మిగిలింది డాక్టర్ బాబు గౌతమ్, మణికంఠ మాత్రమే. వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఉత్కంఠగా మారింది. అయితే ఎవరు హౌస్ నుంచి వెళ్ళాలి అనేది మీరిద్దరే తేల్చుకోండి అని నాగార్జున నిర్ణయం వాళ్ళకే వదిలేశారు. గౌతమ్ నేను బయటకి వెళతాను అని చెప్పాడు. మణికంఠ లేదు నేను వెళతాను.. నాకు బిగ్ బాస్ గేమ్ ఆడలేకున్నాను.. నేను వెళ్ళిపోతాను అని తెలిపాడు. సాధారణంగా అయితే గౌతమ్ లీస్ట్ ఓటింగ్ తో ఉన్నారు. ఎలిమినేషన్ నార్మల్ గా జరిగి ఉంటే గౌతమ్ ఎలిమినేట్ కావలసింది. కానీ ఎలిమినేషన్ సహజంగా జరగలేదు. 

ఇద్దరూ వెళ్లిపోవడానికి సుముఖంగా ఉండడంతో నాగార్జున ఎలిమినేషన్ నిర్ణయాన్ని ఇంటి సభ్యులకు ఇచ్చారు. మణికంఠ, గౌతమ్ లలో ఎవరు ఎలిమినేట్ కావాలని అనుకుంటున్నారు అని నాగార్జున ఇంటి సభ్యులని అడిగారు. కేవలం ముగ్గురు తప్ప మిగిలిన వాళ్లంతా మణికంఠ ఎలిమినేట్ కావాలని ఓట్ వేశారు. నబీల్, నయని పావని, మెహబూబ్ మాత్రమే మణికంఠ హౌస్ లో ఉండాలి అని కోరుకున్నారు. 

దీనితో ఇంటి సభ్యులంతా మణికంఠకి వెన్ను పోటు పొడిచినట్లు అయింది. మణికంఠ హౌస్ లో తొలి రోజు నుంచి ఉంటున్నాడు. కానీ నిన్నకాక మొన్న వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వచ్చిన గౌతమ్ కి ఇంటి సభ్యులు సపోర్ట్ ఇవ్వడం.. మణికంఠకి వెన్నుపోటు అనే చెప్పాలి. మణికంఠ ఎలిమినేషన్ అయితే జరిగింది కానీ అతడిని సీక్రెట్ రూమ్ లో ఉంచారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. కొన్ని రోజుల తర్వాత హౌస్ లోకి తిరిగి తీసుకురావచ్చు అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే వేచి చూడాలి. 

Latest Videos

click me!