దీపికా పదుకొనే బేబీ బంప్ ఫోటోలు వైరల్

First Published | Sep 2, 2024, 9:11 PM IST

బాలీవుడ్ నటి దీపికా పదుకొనే తన  బేబీ బంప్ ఫోటోషూట్ తో  అందరినీ ఆశ్చర్యపరిచారు. తన భర్త, నటుడు రణ్‌వీర్ సింగ్‌తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీపికా పదుకొనే ఫోటోలు

నటి దీపికా పదుకొనే తన భర్త రణ్వీర్ సింగ్ తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బేబీబంప్ తో ఉన్నారు దీపికా. 

దీపికా పదుకొనే

2006 లో ఐశ్వర్య అనే కన్నడ సినిమాతో నటిగా అరంగేట్రం చేసిన దీపికా పదుకొనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.


దీపికా పదుకొనే తొలి చిత్రం

2007లో షారుఖ్ ఖాన్ సరసన ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన దీపికా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు.

షారుఖ్ తో దీపికా

తనకు బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ అవకాశం ఇచ్చారనే కారణ సినిమాలకు సబంధించి షారుఖ్ ఖాన్ ఏం చెబితే ఆ మాటను దీపికా పదుకొనే శిరోధార్యంగా తీసుకుంటారు.

దీపికా పదుకొనే సెంటిమెంట్

షారుఖ్ ఖాన్ కుటుంబానికి దీపికా చాలా దగ్గరగా ఉంటారు. ఎంత బిజీగా ఉన్నా షారుఖ్ ఖాన్ తన సినిమాలో నటించమని అడిగితే నటించడానికి ఒప్పుకుంటారు.

దీపికా - రణ్వీర్ ప్రేమ

నటుడు రణ్వీర్ సింగ్‌తో ప్రేమలో పడిన దీపికా పదుకొనే 2018 లో ఇటలీలో వివాహం చేసుకున్నారు. పెళ్ళి తరువాత తమ సినిమాలతో బిజీ అయ్యారు స్టార్స్.

దీపికా పెళ్లి

ఇది ప్రైవేట్ వేడుకగా జరగ్గా.. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ సహా కొద్దిమంది సినీ ప్రముఖులు హాజరై దీపికా - రణ్‌వీర్ సింగ్ జంటను ఆశీర్వదించారు.

గర్భవతి అని ప్రకటించిన దీపికా

పెళ్లి తర్వాత కూడా నటనపై దృష్టి సారించిన దీపికా పదుకొనే.. ఫిబ్రవరిలో తాను గర్భవతి అని ప్రకటించి అభిమానులకు ఆనందాన్ని పంచారు.

కల్కి సినిమాలో దీపికా

గర్భవతి అయిన తర్వాత కల్కి 2898 AD చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమితాబ్ బచ్చన్, ప్రభాస్ ఇద్దరూ దీపికా పదుకొనేకు పోటీ పడి మరీ సాయం చేయడం అప్పట్లో వైరల్ అయ్యింది.

దీపికా పదుకొనే ఫోటోలు

గర్భధారణ తర్వాత పూర్తి విశ్రాంతి తీసుకుంటున్న దీపికా పదుకొనే.. ఇప్పుడు తన బేబీ బంప్ కనిపించేలా ఫోటోలు షేర్ చేసుకోవడంతో అవి వైరల్ అవుతున్నాయి.

అభిమానుల శుభాకాంక్షలు

త్వరలో తల్లి కాబోతున్న దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ లకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ జంట తమ మొదటి బిడ్డకు వెల్కం చెప్పడానికి ఎదురుచూస్తున్నారు. 

Latest Videos

click me!