వేణు స్వామి మూడు విషయాల్లో ఘోరంగా విఫలమయ్యారు. ఆయన గెలుస్తారు అని చెప్పిన తెలంగాణ/ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ ఓటమిపాలయ్యారు. అలాగే హైదరాబాద్ ఈసారి ఐపీఎల్ టైటిల్ కైవశం చేసుకుంటుందని అన్నాడు. అక్కడ కూడా వ్యతిరేక ఫలితం వచ్చింది.
ఈ ఫలితాల నేపథ్యంలో వేణు స్వామి సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇకపై రాజకీయాలు, సినిమాలు గురించి జ్యోతిష్యం చెప్పనని ఓ వీడియో బైట్ విడుదల చేశాడు. అయినప్పటికీ ఆయన మీద ట్రోలింగ్ ఆగడం లేదు. దీనితో తనను ట్రోల్ చేస్తున్నవారికి వేణు స్వామి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు.
Venu Swami
ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత నాపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఈ ట్రోలింగ్ నాకేమీ కొత్తకాదు. అలాగే నేను దేవుడిని కాదు. నేను చెప్పిన వాటిలో 100 కి 98, 99 శాతం నిజం అయ్యాయి. అది నా సక్సెస్ రేట్. ఎన్నికల ఫలితాల విషయంలో జరగలేదు. అది నేను స్వయంగా ఒప్పుకున్నారు. పెద్ద పెద్ద జ్యోతిష్యులు, స్వామీజీలు ప్లేటు ఫిరాయించారు.
కానీ వేణు స్వామి అలాంటివాడు కాదు. వేణు స్వామికి ధైర్యం ఉంది. సబ్జెక్టు మీద దమ్ము ఉంది. నా ప్రెడిక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డిది తప్ప అన్నీ నిజమయ్యాయి. కాబట్టి నేను భయపడే సవాలే లేదు. ట్రోలింగ్ వలన వేణు స్వామి ఎక్కడున్నాడని ఫాలోవర్స్ భయపడుతున్నారు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. రిజల్ట్ తర్వాత యధావిధిగా పూజల్లో పాల్గొంటున్నాను.
photo credit mana star
నీ మీద ట్రోల్స్ జరగడం వలన రెగ్యులర్ గా వచ్చే ఎంక్వైరీల కంటే ఇంకో 100 శాతం పెరిగాయి. దాని వలన నేను ఇంకా బిజీ అయ్యాను. మీ ట్రోల్స్ వలన నాకు పని పెరిగింది. ఆ అమ్మవారి దయ నా ట్రోలర్స్ పై, నా ఫ్యామిలీని వ్యక్తిగతంగా విమర్శించే వారిపై ఉండాలని కోరుకుంటున్నాను. నేను వెయ్యి సుఖాలతో ఇక్కడికి వచ్చిన వాడ్ని కాదు. లక్ష కష్టాలతో ఈ స్థాయిలో ఉన్నాను. ఈ ట్రోల్స్ నేను లెక్క చేయను. రెండు తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిష్యం అంటే వేణు స్వామినే గుర్తుకు వస్తాడు... అని అన్నారు.