ఆ తర్వాత సీన్లో హిమ, ఆనందరావు, సౌందర్య, కారులో వెళ్తుండగా హిమ మళ్ళీ సౌర్య దగ్గరికి తీసుకు వెళ్ళమని అడుగుతుంది. అప్పుడు సౌందర్య,ఒకసారి చెప్తే వినమ్మా,అక్కడికి వెళ్తే ఎప్పటికీ మర్చిపోలేని భయంకరమైన రోజవుతుంది. అన్ని బాగుంటే వచ్చే సంవత్సరం ఇద్దరం కలిసి పుట్టిన రోజు చేసుకోండి అని అంటుంది. ఆ తర్వాత సౌర్య, వారణాసి తో కలిసి గుడికి వచ్చి,ఈ రోజు నా పుట్టిన రోజు వారణాసి అని అంటుంది.