ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నందుకు ఆ ముగ్గురు ఆనందం వ్యక్తం చేశారు.గీతూ, ఆదిరెడ్డి, నేహా చౌదరి ఓ చోట చేరి ముచ్చటించారు. నిజానికి కష్టపడి ఎలిమినేషన్ నుండి తప్పుకుంది ఒక్క నేహా మాత్రమే, మనం ఇద్దరం ఏం చేయకుండానే సేవ్ అయ్యామని గీతూ అదిరెడ్డిని ఉద్దేశించి అంది. నామినేటైన వాళ్లు అభినయశ్రీ, ఇనయ ముఖంలో కొంత టెన్షన్ కనిపించింది. బాల ఆదిత్య కూల్ గా ఉన్నాడు.