అందుకేనా నన్ను ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పావు అని ఉంటాడు కార్తీక్. అప్పుడు సౌర్యకి కార్తీక్ వాళ్ళు కనిపించకుండా ఇంద్రుడు అడ్డుకుంటాడు. అప్పుడు కార్తీక్ తన పరిస్థితి గురించి చెప్పి దీపకీ అడ్డుకట్ట వేస్తాడు. అప్పుడు దీప, సౌర్యనీ చూసి ఎమోషన్ అవుతూ ఉండగా కార్తీక్ నచ్చచెప్పి అక్కడినుంచి పిలుచుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఇంద్రుడు ఎమోషనల్ అవుతూ ఉండగా ఎందుకు బాబాయ్ అంతలా ఏడుస్తున్నావు అని అడగగా ఏం లేదు జ్వాలమ్మ అని అబద్ధం చెప్పి కవర్ చేస్తాడు. మరొకవైపు సౌందర్య, హిమ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు సౌందర్యచదువు మీద కాన్సన్ట్రేషన్ చేయి ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవ్వు అని అంటుంది.