అయితే అత్యధిక ఓట్లతో టైటిల్ గెలిచింది శ్రీహాన్(Sreehan) అని నాగార్జున ఫైనల్ గా రివీల్ చేశాడు. దాంతో అందరి మైండ్ బ్లాక్ అయ్యింది. స్వల్ప ఓట్ల తేడాతో రేవంత్ పై శ్రీహాన్ గెలిచాడని చెప్పడం సంచలనమైంది. గత ఐదు సీజన్స్ లో ఎన్నడూ జరగని పరిణామం ఇది. విన్నర్ రేవంత్, రన్నర్ శ్రీహాన్ ఇద్దరూ నొచ్చుకునే పరిస్థితి అక్కడ నెలకొంది.