ఈరోజు ఎపిసోడ్ లో దీప,సౌర్యని వెతకడానికి వెళ్తాను అని మొండి పట్టు పడుతుండగా కార్తీక్ ఆ డాక్టర్ ఇద్దరు వెళ్లొద్దు దీప అని అంటుంటారు. దీప వెళ్తాను అని బలవంతం చేస్తుండడంతో వెంటనే ఆ డాక్టర్ దీప షటాప్ అని గట్టిగా అరుస్తుంది. ఇందాక నుంచి వెళ్తాను అంటున్నావు ఆయన ఇక్కడ ఎందుకు ఉన్నారో నీకు తెలుసా అని అనగా వెంటనే కార్తీక్ చెప్పొద్దు అంటూ సైగ చేస్తాడు. అప్పుడు దీప ఎందుకు ఉన్నారు ఆయన ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? ఆయన నాకేమైనా ఆపరేషన్ చేశారా అని అనగా వెంటనే డాక్టర్ ఆపు అని అంటుంది. కూతురు కోసం వెళ్లమని చెబుతున్నావు నిన్ను ఎలా వదిలేసి ఎలా వెళ్తాడు అయినా ఆయన నీకోసం ఎంత తాపత్రయపడుతున్నాడో నీకు ఏమవుతుందని ఎంత బాధ పడుతున్నాడో తెలుసా అని అంటుంది.