నెపోటిజం పై అల్లు అరవింద్ సీరియస్ కామెంట్స్... వాళ్ళు గుండెలపై చేయి వేసుకొని చెప్పగలరా!

Published : Dec 03, 2022, 06:55 AM IST

నెపోటిజంపై చాలా కాలంగా చర్చ నడుస్తుంది. ఇది పరిశ్రమలో కొంతమంది అధిపత్యానికి కారణమై అవుట్ సైడర్స్ ఎదగకుండా దెబ్బతీస్తుందనే వాదన ఉంది. ఈ సీరియస్ అండ్ కాంట్రవర్షియల్ ఇష్యూపై అల్లు అరవింద్ పెదవి విప్పారు.  

PREV
17
నెపోటిజం పై అల్లు అరవింద్ సీరియస్ కామెంట్స్... వాళ్ళు గుండెలపై చేయి వేసుకొని చెప్పగలరా!
Balakrishna Unstoppable show


నెపోటిజం అనే పదాన్ని ఈ మధ్య ఒక బూతుగా చూస్తున్నారు. చాలా కాలంగా నెపోటిజం కారణంగా నష్టపోయామన్న ఆరోపణలు ఉన్నాయి. వారసుల కోసం ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని అవుట్ సైడర్స్ తొక్కిపడేస్తారనే విమర్శ ఉంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం నెపోటిజంపై ఒక ఉద్యమాన్నే తెచ్చింది. బాలీవుడ్ పెద్దలకు, నెపోకిడ్స్ కి వ్యతిరేకంగా ఒక వర్గం సోషల్ మీడియా పోరాటం చేస్తున్నారు. 

27
Balakrishna Unstoppable show

బాయ్ కాట్ బాలీవుడ్ హ్యాష్ ట్యాగ్ ఈ ఉద్యమంలో భాగమే. అలియా భట్, సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, మహేష్ భట్, కరణ్ జోహార్ సినిమాలంటే ట్రోల్ చేయడానికి, బాయ్ అంటూ ట్రెండ్ చేయడానికి కొందరు సిద్ధంగా ఉంటారు. హీరోయిన్ కంగనా రనౌత్ నెపోటిజాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

37
Balakrishna Unstoppable show

బాలీవుడ్ కి మించి టాలీవుడ్ లో నెపోటిజం ఉంది. ఇక్కడ టాప్ స్టార్స్ అందరూ నెపో కిడ్సే. ఒక్క మెగా ఫ్యామిలీ నుండే ముగ్గురు స్టార్ హీరోలు ఉన్నారు. మరో ముగ్గురు నలుగురు టైర్ టు హీరోలు పుట్టుకొచ్చారు. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా అందరూ బ్యాక్ గ్రౌండ్ తో హీరోలుగా ఎదిగినవారే. 
 

47
Balakrishna Unstoppable show


ఈ నెపోటిజం అనే సీరియస్ అండ్ సెన్సిటివ్ మ్యాటర్ పై అల్లు అరవింద్ మాట్లాడారు. బాలకృష్ణ అన్ స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్స్ గా నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్ వచ్చారు. బాలయ్య నెపోటిజం పై తమ అభిప్రాయం చెప్పమనగా... అల్లు అరవింద్ కొంచెం ఘాటుగా స్పందించారు. 
 

57
Balakrishna Unstoppable show


నన్ను ట్రోల్ చేసినా పర్లేదు. నెపోటిజం అని విమర్శించే వాళ్ళు గుండెల మీద చేయి వేసుకొని ఒక విషయం చెప్పాలి. వాళ్లకు కూడా ఇలాంటి అవకాశం వస్తే... ఉపయోగించుకునేవారా? లేక ఇది నెపోటిజం అని పక్కకు వెళ్లిపోయేవారా?. చిన్నప్పటి నుండి ఆ వాతావరణంలో పెరిగి ఇంట్రెస్ట్, టాలెంట్ ఉన్నప్పుడు పేరెంట్స్ చూపిన మార్గం ఎంచుకోవడంలో తప్పేమీ లేదు. 

67
Balakrishna Unstoppable show


నాకు ఒక లాయర్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన పేరెంట్స్ లాయర్లు. ఆయన కూడా అదే వృత్తిలోకి వచ్చారు. జడ్జి కూడా అయ్యాడు. తన ఇద్దరు కుమారులలో పెద్దవాడికి వేరే ఇంట్రెస్ట్ ఉంది. అతడు ఆర్టిస్ట్ అయ్యాడు. చిన్నవాడు మాత్రం ఆ వాతావరణంలో పెరగడం వలన లాయర్ అయ్యాడు. దాన్ని నెపోటిజం అని విమర్సించలేం కదా. లాయర్లు, డాక్టర్స్, ఇంజనీర్స్, బిజినెస్ మెన్ ఇలా ప్రతి రంగంలో నెపోటిజం ఉందని, అల్లు అరవింద్ కుండబద్దలు కొట్టారు. 
 

77
Balakrishna Unstoppable show


సురేష్ బాబు మాట్లాడుతూ... నెపోటిజం కేవలం ఆరంభం ఇస్తుంది. స్టార్ కావాలంటే టాలెంట్ ఉండాల్సిందే. కేవలం వారసత్వం వలన  ఎదగలేరు, అన్నారు. బాలయ్య మరో ప్రశ్నగా హీరోలు, డైరెక్టర్స్, నిర్మాతల కొడుకులు అందరూ హీరోలే ఎందుకు కావాలి అనుకుంటున్నారు. డైరెక్టర్స్ కావచ్చుగా? అని అడిగారు. డైరెక్టర్స్ కావడం కష్టం. హీరో అవడం ఈజీ అనుకుంటారు కానీ అది నిజం కాదు. అందుకే చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ అవుతారని చెప్పుకొచ్చారు. 
 

click me!

Recommended Stories