Karthika Deepam: డాక్టర్ అంజలి ఇంట్లో వేడుక.. పయనమైన మోనిత.. అక్కడే గరిట పట్టనున్న వంటలక్క!

Navya G   | Asianet News
Published : Feb 04, 2022, 01:52 PM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం (Karthika Deepam). ట్విస్టుల మీద ట్విస్టులతో ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ఇక రేటింగ్ విషయంలో ఈ సీరియల్ ను ఏ సీరియల్ క్రాస్ చేయలేదు. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏమిటో ఓ సారి చూద్దాం.

PREV
16
Karthika Deepam: డాక్టర్ అంజలి ఇంట్లో వేడుక.. పయనమైన మోనిత.. అక్కడే గరిట పట్టనున్న వంటలక్క!

డాక్టర్ కార్తీకే స్వయంగా వైద్యం చేయడానికి వచ్చాడు అని అక్కడి డాక్టర్లు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. మరోవైపు దీప (Deepa) ఈ సమయంలో కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తూ బాధపడుతుంది.ఇక కార్తీక్ (Karthik) మాత్రం సౌర్య కు వేగంగా వైద్యం పూర్తి చేస్తాడు. కార్తీక్ తమ హాస్పిటల్ కు వచ్చినందుకు  డాక్టర్లు దన్యవాదాలు తెలియజేస్తారు.

26

వైద్యం చేసి బయటకు వస్తున్న కార్తీక్ ను చూసి దీప ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. ఆ తర్వాత హాస్పిటల్ స్టాప్ కూడా వచ్చి దీప (Deepa) కు ఆపరేషన్ సక్సెస్ అని  చెబుతారు. మరోవైపు రుద్రాణికి (Rudrani) సౌర్య ఆపరేషన్ సక్సెస్ అయిన సంగతి తెలియడంతో ఆ విషయాన్ని జీర్ణించుకోలేక తన మనుషులపై మండిపడుతుంది.
 

36

ఇక హాస్పిటల్లో సౌర్య కళ్ళు తెరిచి దీప తో మాట్లాడుతుంది. దీప (Deepa), సౌర్య కు నీకేం కాదమ్మా అని ధైర్యం  చెబుతూ నీకు ఒక గొప్ప డాక్టర్ వైద్యం చేసాడని అంటుంది. సౌర్య తనకు ఏం జరిగిందని అనటంతో కడుపు నొప్పి అని అబద్ధం చెబుతుంది దీప. వెంటనే సౌర్య (Sourya) నాకు ఛాతి దగ్గర నొప్పిగా ఉంది.
 

46

నాకు ఏదైనా ఆపరేషన్ చేశారా.. డబ్బులు ఎక్కడివి అమ్మా అని ప్రశ్నలు వేస్తోంది. ఇప్పుడు నువ్వు ఏమీ మాట్లాడకు ఇంటికి వెళ్లిన తర్వాత  అన్నీ మాట్లాడుకుందాం అత్తమ్మ అని దీప చెబుతుంది. మరోవైపు అప్పారావు (Apparao) కార్తీక్ తో ఎమోషనల్ గా మాట్లాడతాడు. ఆ తర్వాత కార్తీక్ (Karthik) మా పరిస్థితి తెలుసుకొని మీరు మాకు సహాయం చేశారు.
 

56

చాలా థాంక్స్ డాక్టర్ అని చేతులెత్తి దండం పెడతాడు. దానికి డాక్టర్ అంజలి (Anjali).. అయ్యో మీవల్లే డాక్టర్ కార్తీక్ గారు మా హస్పిటల్ కు వచ్చారని ఆనందం వ్యక్తం చేస్తుంది. ఆ తరువాత ఆ డాక్టర్ కి దీప (Deepa) వంటల ప్రత్యేకత తెలిసి.. వాళ్ళ పాప బర్త్ డే కు వంటలు చేయడానికి పిలుస్తుంది.  ఇక దీప మీరు మాకు ఇంత హెల్ప్ చేశారు.
 

66

మీకు ఆ మాత్రం సహాయం చేయడం మాకు చాలా సంతోషం అని చెబుతుంది. దీప (Deepa) కు సహాయం చేయడానికి నేను వస్తాను అని కార్తీక్ కూడా అంటాడు. ఒకవైపు అదే బర్త్ డే కి మోనిత (Monitha), భారతి లు బయలుదేరుతారు. మరి ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories