NTR Upcoming Movies: ఎన్టీఆర్ 30 టూ ఎన్టీఆర్ 40... నెక్స్ట్ 11 చిత్రాలు ఈ దేశం మెచ్చిన దర్శకులతోనే!

Published : Feb 04, 2022, 01:12 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ఆర్ ఆర్ ఆర్ మూవీలో కొమరం భీం గా విజృంభించనున్నారు.ఆర్ ఆర్ ఆర్ ప్రోమోలతో ఆయన పాత్ర ఎంత రౌద్రంగా ఉండనుందో అర్థమైంది.  గాయపడిన పెద్ద పులిలా ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ గర్జిస్తున్నారు. కొమరం భీమ్ గా హై ఎడ్రినలిన్ ఫ్యాన్స్ లో పంప్ చేయనున్నారు.

PREV
111
NTR Upcoming Movies: ఎన్టీఆర్ 30 టూ ఎన్టీఆర్ 40... నెక్స్ట్ 11 చిత్రాలు ఈ దేశం మెచ్చిన దర్శకులతోనే!


ఆర్ ఆర్ ఆర్ (RRR Movie) విడుదల తర్వాత ఎన్టీఆర్ రేంజ్ ఊహించడానికి కూడా కష్టమనేది పలువురు అభిప్రాయం. ముఖ్యంగా ఆయన ఎనెర్జీకి బాలీవుడ్ షేక్ కావడం ఖాయం అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తో మూవీ చేయాలనుకుంటున్న స్టార్ దర్శకులు ఆయన కోసం అదే తరహా కథలు సిద్ధం చేస్తున్నారు. కాగా ఎన్టీఆర్ నెక్స్ట్ లిస్ట్ లో ఉన్న టాప్ లెవెన్  దర్శకుల పేర్లు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. 

211

ఎన్టీఆర్ 30వ (NTR 30) చిత్రం కొరటాల శివతో కన్ఫర్మ్ అయ్యింది. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. యూనివర్సల్ కాన్సెప్ట్ తో తన మార్కు సోషల్ మెసేజ్ జోడించి కొరటాల ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది.

311

అనూహ్యంగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుకు ఎన్టీఆర్ పచ్చ జెండా ఊపారనేది లేటెస్ట్ బజ్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ మూవీలో ఎన్టీఆర్ కబడ్డీ ప్లేయర్ గా కనిపించనున్నారట. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని వినికిడి. అలాగే పెద్ది అనే ఓ పవర్ ఫుల్ టైటిల్ అనుకుంటున్నారట.

411

ఎన్టీఆర్ 32వ (NTR 32)చిత్రాన్ని కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా జరిగింది. ప్రభాస్ సలార్ పూర్తి కాగానే ఎన్టీఆర్ చిత్ర పనుల్లో ప్రశాంత్ నీల్ బిజీ కానున్నారు. ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలున్నాయి. 

511


కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ ఎన్టీఆర్ తో మూవీ చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ కాంబినేషన్ లో మూవీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎన్టీఆర్ 33వ చిత్రం అట్లీతో అంటూ ప్రచారం నడుస్తుంది. 

611


ఆర్ ఆర్ ఆర్ మూవీ చిత్రీకరణ దశలో ఉండగా... త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మూవీ ప్రకటించారు. కారణం ఏదైనా ఆ ప్రాజెక్ట్ డిలే అయ్యింది. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ మూవీ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ 34వ చిత్రం త్రివిక్రమ్ తోనే అట. 

711


కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడిగా పేరున్న వెట్రి మారన్ ఎన్టీఆర్ దర్శకుల లిస్ట్ లో ఉన్నారు. ఈ విభిన్న చిత్రాల దర్శకుడితో కూడా  ఎన్టీఆర్ మూవీ చేసే అవకాశం కలదట. అన్నీ కుదిరితే ఎన్టీఆర్ 36వ చిత్రం వెట్రి మారన్ దర్శకత్వంలో ఉంటుందట. 

811

పెళ్లి చూపులు చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నెమ్మదించారు. అయితే తన స్క్రిప్ట్ తో ఎన్టీఆర్ ని ఆకట్టుకున్న తరుణ్ ఆయన 37వ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

911


నాన్నకు ప్రేమతో మూవీతో క్లాసిక్ హిట్ కొట్టాడు ఎన్టీఆర్. ఆ మూవీ విడుదలై చాలా కాలం అవుతుంది. ఈ కాంబినేషన్ ఎన్టీఆర్ 38వ చిత్రంతో రిపీట్ కానుందట. ఎన్టీఆర్ 38వ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించనున్నారట. 

1011

ఖైదీ, మాస్టర్ వంటి వరుస హిట్స్ తో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరారు లోకేష్ కనకరాజ్. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఎన్టీఆర్ 39వ చిత్ర దర్శకుడన్న బజ్ నడుస్తుంది.

1111
ఎన్టీఆర్‌ చిరుదరహాసం.

ఎన్టీఆర్ 40వ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించనున్నారట. ఇది వీరిద్దరి కంబినేషన్ లో తెరకెక్కే ఐదవ చిత్రం కానుంది. ఇక రాజమౌళి సినిమా అంటే ఆ సినిమా స్థాయి ఈ రేంజ్ లో ఉంటుందో ఊహించవచ్చు. అయితే వీటిలో చాలా కాంబినేషన్స్ కేవలం చర్చల దశలో ఉన్నాయి. కాబట్టి కార్యరూపం దాల్చే వరకు అనుమానమే.

click me!

Recommended Stories