సమంత నుంచి జయసుధ వరకు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Published : Dec 02, 2025, 09:57 AM IST

Second Marriages Heroines Full List : హీరోయిన్ సమంత రెండో పెళ్ళి చేసుకుంది. ఇండస్ట్రీలో హీరోయిన్లు రెండో పెళ్ళి చేసుకోవడం అరుదు. టాలీవుడ్ హీరోయిన్లు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. సమంత దగ్గర నుంచి జయసుధ వరకు రెండో పెళ్లి చేసుకున్న తారలు ఎవరెవరంటే?

PREV
17
సమంత - రాజ్ నిడమోరు పెళ్లి

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. హీరో నాగచైతన్యతో విడాకుల తరువాత చాలా కాలం సింగిల్ గా ఉన్న సామ్... ఫ్యామిలీమ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో ప్రేమలో పడింది. చాలా రోజులు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట.. తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. డిసెంబర్ 1 న రాజ్ నిడుమోరును ఈషా ఫౌండేషన్ లోని అమ్మవారి గుడిలో భూత శుద్ది వివాహా పద్ధతిలో పెళ్లాడింది సమంత.

27
అదితి రావు హైదరీ - సిద్ధార్ధ్

ఇక సమంత కంటే ముందు కొంత మంది హీరోయిన్లు రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. వారిలో రీసెంట్ గా రెండో పెళ్లి చేసుకుంది అదితి రావు హైదరీ. అదితి రావు హైదరీ హీరో సిద్ధార్ధ్ ను సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. అంతకు ముందు ఈమె సత్యదీప్ మిశ్రాను పెళ్ళి చేసుకుంది. వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆతరువాత మోడలింగ్ లోకి వచ్చి.. హీరోయిన్ గా మారిన అదితి.. తనతో పాటు సముద్రం సినిమాలో నటించిన సిద్ధార్ధ్ తో ప్రేమలో పడింది. కొంత కాలం లివింగ్ రిలేషన్ లో ఉన్న ఈ స్టార్ జంట.. ఈమధ్యనే పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.

37
అమలా పాల్ రెండో పెళ్లి..

సౌత్ స్టార్ హీరోయిన్ అమలా పాల్.. కూడా రెండో పెళ్లి చేసుకున్నవారి లిస్ట్ లో ఉంది. కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే అమలా పాల్ తమిళ డైరెక్టర్ ఎల్.విజయ్‌ను ప్రేమించి పెళ్లాడింది. ఆతరువాత వీరి మధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయింది. విడాకుల తరువాత సినిమాలపై ఫోకస్ పెట్టిన అమలా పాల్.. జగత్ దేశాయ్ తో లివింగ్ రిలేషన్ ను చాలా కాలం కొనసాగించింది. ఇద్దరు ఒకరినొకరు అర్ధం చేసుకున్న తరువాత వారు పెళ్లి చేసుకున్నారు.

47
రాధిక మూడు పెళ్లిళ్లు

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది రాధిక. చిరంజీవి, కమల్ హాసన్ లాంటి స్టార్స్ తో ఆడిపాడింది. దాదాపు రెండు దశాబ్ధాల పాటు ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన రాధిక.. పర్సనల్ లైఫ్ లో మాత్రం మూడు పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లో నిలిచింది. రాధిక ముందుగా నటుడు ప్రతాప్ పోతన్ ను పెళ్లాడింది. అతనితో విడాకుల తరువాత ఫారెనర్ అయిన రిచర్డ్ హార్డీని పెళ్లి చేసుకుంది. చాలా కాలం రచర్డ్ తో ఫారెన్ లో ఉండిపోయింది రాధిక. వీరికి ఒక పాప పుట్టిన తరువాత అతని టార్చర్ తట్టుకోలేక విడాకులు తీసుకుని ఇండియా వచ్చింది. ఇక తన సహచరుడు శరత్ కుమార్ ను ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంది రాధిక. 2001లో వీరి పెళ్లి జరిగింది. అప్పటి నుంచి వీరు హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు.

57
జయసుధ మొదటి భర్త ఎవరో తెలుసా?

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. సహజ నటి జయసుధ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇండస్ట్రీలో చాలామందకి తెలిసిన.. ఆడియన్స్ లో కొంత మందికి మాత్రమే ఈ విషయం తెలుసు. జయసుధ నితిన్ కపూర్ కంటే ముందు కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లాడింది. కానీ అతని వల్ల ఇబ్బందులు ఎదురవ్వడంతో.. కొంత కాలానికి విడికాులు ఇచ్చి.. 1985లో నితిన్ కపూర్ ను పెళ్లి చేసుకుంది. రీసెంట్ ఇయర్స్ లో నితిన్ కపూర్ మరణం అందరికి తెలిసిందే.

67
విజయ నిర్మల - కృష్ణ

ఇక ఆ కాలంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు కృష్ణ - విజయ నిర్మల. ఈ జంట రెండో పెళ్లి అప్పట్లో సంచలనంగా మారింది. కృష్ణ కు పెళ్లై 5 గురు పిల్లలు ఉన్నారు. విజయ నిర్మలకు పెళ్లై హీరో నరేష్ కూడా పుట్టాడు. అటువంటి పరిస్థితుల్లో విజయ నిర్మల మొదటి భర్తకు విడాకులు ఇచ్చి.. కృష్ణను రెండో పెళ్లి చేసుకున్నారు.

77
మూడు పెళ్లిళ్లు చేసుకున్న తారలు..

ఫిల్మ్ఇండస్ట్రీలో రెండు కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న తారలు చాలా మంది ఉన్నారు. వారిలో నటి లక్ష్మి, వనిత విజయ్ కుమార్ కూడా ఉన్నారు. లక్ష్మి భాస్కర్ ను మొదట పెళ్లి చేసుకుంది. ఆయనతో విడాకుల తర్వాత మోహన్ శర్మను పెళ్లాడింది. ఆ తర్వాత అతనికి కూడా విడాకులు ఇచ్చి.. శివ చంద్రన్ ను మూడో పెళ్లి చేసుకుంది. మరో హీరోయిన్ వనితా విజయ్ కుమార్. కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. వనితా విజయకుమార్ 2007లో ఆకాష్‌తో ఫస్ట్ పెళ్లి జరిగింది. ఆయనతో విడాకుల తర్వాత రాజన్ ఆనంద్‌ను రెండో పెళ్లి చేసుకుంది. రాజన్‌ నుంచి కూడా డివోర్స్ తీసుకుని 2020లో పీటర్ పాల్‌ను ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories