నిహారిక అసహనం...
అయితే.. అవార్డులు గెలుచుకున్నామన్న సంతోషం తమకు లభించలేదని నిహారిక అసహనం వ్యక్తం చేసింది. అవార్డులు ప్రధానం చేసినప్పటికీ, విజేతలకు కనీసం విన్నింగ్ స్పీచ్ ఇచ్చే అవకాశం ఇవ్వలేదు. తెలుగు వారికే కాకుండా తమిళ, కన్నడ పరిశ్రమలకు చెందిన కొత్త వారికి కూడా ఇలానే చేసినట్లు సమాచారం. దీంతో.. ఈ ఘటనపై నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా కాస్త ఘాటుగానే స్పందించింది. ఈవెంట్ నిర్వహణ తీరుపై ఆమె మండిపడ్డారు.
"కొత్తగా పరిశ్రమలోకి వచ్చే వారికి ఫిల్మ్‌ఫేర్ వంటి ప్రతిష్ఠాత్మక వేదికపై నిలబడి మాట్లాడటం అనేది ఒక లాంఛనం కాదు, అది వారి జీవితకాల స్వప్నం" అని ఆమె పేర్కొన్నారు.పెద్ద ఈవెంట్లలో సమయ పరిమితులు ఉంటాయని అంగీకరిస్తూనే, "తొలిసారి అవార్డు గెలుచుకున్న వారి కోసం కనీసం ఒక నిమిషం కేటాయించినా వారిలో ఎంతో ఉత్సాహం నిండుతుంది" అని ఆమె అభిప్రాయపడ్డారు. నిహారిక పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. అయితే.. ఈ విషయంపై నిర్వాహకులు స్పందించకపోవడం గమనార్హం.