Prashanth Varma : సుకుమార్ ను ఫాలో అవుతున్న ప్రశాంత్ వర్మ? ఇంత తక్కువ టైమ్ లోనే!

Published : Jan 27, 2024, 02:31 PM ISTUpdated : Jan 27, 2024, 02:33 PM IST

‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ Prashanth Varma  నుంచి కొత్త డైరెక్టర్ రాబోతున్నారంట... తీసినవి తక్కువ సినిమాలే అయినా.. ప్రస్తుతం టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. 

PREV
16
Prashanth Varma : సుకుమార్ ను ఫాలో అవుతున్న ప్రశాంత్ వర్మ? ఇంత తక్కువ టైమ్ లోనే!

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రీసెంట్ గా ‘హనుమాన్’ HanuMan  మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చినా ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పట్టారు. 

26

వందల కోట్లు పెట్టి భారీ చిత్రాలను నిర్మిస్తున్న తరుణంలో ప్రశాంత్ వర్మ తక్కువ ఖర్చుతో క్వాలిటీ సినిమాను తీయడంతో ప్రస్తుతం ఆయన పేరు హాట్ టాపిక్ గ్గా మారింది. ఆయన పేరు మారుమోగుతోంది. 

36

ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందుతూనే ఉన్నాయి. ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ గురించి మరో న్యూస్ నెట్టింట చేరింది. 
 

46

త్వరలోనే ప్రశాంత్ వర్మ టీమ్ నుంచి ఒకరు డెబ్యూ డైరెక్టర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారని తెలుస్తోంది. తన లైనప్ లోని ‘అధీర’ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారని టాలీవుడ్ ఇన్ సైడ్ టాక్. 
 

56

ఇక ఆ చిత్రంలో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు డీవీవీ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారని అంటున్నారు. దీనికి ప్రశాంత్ వర్మ అసిస్టెంట్ ఒకరు దర్శకత్వం వహించబోతున్నాడనేది వార్త. దీనిపై అధికారిక ప్రకటన ఏమీ లేదు. మున్ముందు రావాల్సి ఉంది. 

66

రామ్ గోపాల్ వర్మ, రీసెంట్ గా సుకుమార్ (Sukumar) నుంచి బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల, కార్తీక్ దండు  వంటి కొత్త దర్శకులు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇక ప్రశాంత్ వర్మ కూడా వారి బాటలో నూతన దర్శకులను ఇండస్ట్రీకి అందించబోతున్నారని తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories