కమల్ హాసన్ సినిమాలో దీపికా పదుకొనే..? తమిళంలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న బాలీవుడ్ బ్యూటీ..

Published : Jan 27, 2024, 02:29 PM ISTUpdated : Jan 27, 2024, 02:31 PM IST

సౌత్ లో జోరు పెంచింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే.. బాలీవుడ్ లో స్టార్ డమ్ తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. సౌత్  లో అన్నీ భాషలపై దృష్టి పెంచింది.   

PREV
17
కమల్ హాసన్ సినిమాలో దీపికా పదుకొనే..? తమిళంలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న బాలీవుడ్ బ్యూటీ..

బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ తో దూసుకుపోతోంది దీపికా పదుకునే.  ఉత్తరాధిన బడా బడా స్టార్స్ తో సినిమాలు చేసింది. షారుఖ్, సల్మాన్. అమీర్, రణ్ బీర్, రణ్ బీర్ ఇలా చెప్పుకుంటూ పోతే.. దీపికా ట్రాక్ రికార్డ్ మూమూలుగా ఉండదు మరి. తన కెరీర్ లో చేసిన సినిమాల్లో చాలా వరకూ హిట్ సినిమాలే కనిపిస్తాయి. 

27

దీపికా పదుకునే అవ్వడానికి బాలీవుడ్ హీరోయిన్ అయినా.. ఆమె సౌత్ బ్యూటీనే. హీరోయిన్ల ఫ్యాక్టరీగా పేరు తెచ్చుకున్న మంగుళూరు లో పుట్టిన దీపికా.. మోడల్ గా రాణించి.. ఆతరువాత హీరోయిన్ గా సౌత్ సినిమాద్వారానే ఎంట్రీ ఇచ్చింది. ఆతరువాత బాలీవుడ్ ప్లైట్ ఎక్కిన చిన్నది.. అక్కడే సెటిల్ అయ్యింది. 

37

దీపికా మాత్రమే కాదు..ఐశ్వర్య రాయ్, హేమా మాలినీ, రేఖ,లాంటి స్టార్స్ కూడా సౌత్ నుంచి వెళ్లినవారే. అయితే బాలీవుడ్ లో మాత్రమే వారు సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇక ఈక్రమంలో దీపికా పదుకొనే కూడా సినిమాలపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్‌ కల్కీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న దీపికా..ఇతర భాషలపై కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. 

47

ఇక ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. మూవీలో  శింబు ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. హీరో,విలన్‌గా రెండు పాత్రల్లో మెరవబోతున్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్న ఈ చిత్రంలో దీపికా పడుకోన్‌ హీరోయిన్ గా నటించనుందనే వార్తలొస్తున్నాయి. మరోపైపు దీపికా నిజంగా ఈ ప్రాజెక్ట్ ను ఒప్పుకుందా అని అనుమానాలు కూడా వస్తున్నాయి. 

57

దీపికా పదుకునే త్వరలో తమిళ సినిమా చేయబోతున్నట్టు సమాచారం అందుతోంది. ఓ తమిళ చిత్రంలో ఆమె భాగం కాబోతున్నట్లు సమాచారం. లోక నాయకుడు.. తమిళ అగ్ర నటుడు కమల్‌ హాసన్‌ నిర్మించబోతున్న భారీ పీరియాడిక్‌ మూవీలో నటించే అవకాశం దీపికకు వచ్చిందట. అంతే కాదు తమిళ స్టార్ హీరో  శింబు హీరోగా నటిస్తున్న ఈసినిమాకు దేశింగు పెరియస్వామి దర్శకుడు. 

67

అయితే కథలోని కొత్తదనం నచ్చడంతో దీపికా పడుకోన్‌ ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిగా ఉందని అంటున్నారు. మరో హీరోయిన్ గా  కీర్తి సురేష్‌  కూడా ఈసినిమాలో నటించనుందని సమాచారం.  అయితే సౌత్ లోకి కల్కీ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న బ్యూటీ.. సుదీర్ఘ విరామం తర్వాత  తమిళ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వనుండటం విశేషం. 
 

77

ఇక ఈమూవీకి సబంధించిన అనౌన్స్ మెంట్ తో పాటు.. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ను ఫిబ్రవరి మూడో వారంలో విడుదల చేయబోతున్నారు. మరి శింబు జోడీగా దీపికా ఎలా ఉంటుందో చూడాలి. ఇటు కల్కీ సినిమాలో కూడా కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండగా..దీపికా ప్రభాస్ జోడీగా అలరించనుంది. 

Read more Photos on
click me!

Recommended Stories