మరికొన్ని వారాల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షో ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షోలో పాల్గొనే సెలెబ్రిటీల వివరాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ఓ కలకత్తా బ్యూటీ బిగ్ బాస్ 9లో పాల్గొనబోతున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.
బుల్లితెర ప్రేక్షకులని మంత్ర ముగ్దుల్ని చేసిన ప్రముఖ టీవీ నటి దేబ్జానీ మోదక్, ఇప్పుడు మరొక కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోపాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
DID YOU KNOW ?
నాగార్జున వరుసగా ఏడోసారి
కింగ్ నాగార్జున వరుసగా ఏడవసారి బిగ్ బాస్ షోకి హోస్ట్ గా చేయబోతున్నారు. తొలి రెండు సీజన్లకు ఎన్టీఆర్, నాని హోస్టులుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
25
దేబ్జానీ నటించిన టీవీ సీరియల్స్
బెంగాలీ, తమిళ, తెలుగు భాషల టీవీ పరిశ్రమలలో గుర్తింపు తెచ్చుకున్న దేబ్జానీ మోదక్, ఇప్పటికే పలు హిట్ సీరియల్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఆమె నటించిన ‘రాసతి’, ‘వనత్తై పోలా’, ‘ఎన్నెన్నో జన్మల బంధం’ వంటి టీవీ సీరియల్స్ ప్రేక్షకుల ఆదరణ పొందాయి.
35
దేబ్జానీ బిగ్ బాస్ హౌస్ లో ఎలా రాణిస్తుందో..
ఈ నేపథ్యంలో ఆమె బిగ్ బాస్ వేదికపై అడుగుపెట్టడం షోపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. బిగ్ బాస్ షోలో అడుగడుగా వైవిధ్యమైన సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని ఆమె ఎలా ఎదుర్కొంటారో అనే ఆసక్తి ప్రేక్షకులలో నెలకొంది. బుల్లితెర నటీమణులు బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడం ఇదేమీ కొత్త కాదు.
అక్కినేని నాగార్జున ఈ సీజన్ కు కూడా హోస్ట్ చేయనున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి షోలో కామన్‌మెన్లు కూడా భాగస్వాములవుతారు. అంటే సెలబ్రిటీలు, సామాన్యులు కలిసి ఓ ఇంట్లో నివసించబోతున్నారు.
55
కోల్‌కతాలో పుట్టి పెరిగిన దేబ్జానీ
దేబ్జానీ మోదక్ బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టనున్న వార్త ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దేబ్జానీ వయసు ప్రస్తుతం 29 ఏళ్ళు. దేబ్జానీ కోల్ కతాలో బెంగాలీ ఫ్యామిలీలో పుట్టి పెరిగింది. సోషల్ మీడియాలో ఆమె గ్లామరస్ ఫోటోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9తో దేబ్జానీ క్రేజీ సెలెబ్రిటీగా మారిపోవడం ఖాయం అని అభిమానులు అంచానా వేస్తున్నారు.