విశ్లేషణః
సినిమా లోపల ఇంకో సినిమాని పెట్టి కథని విభిన్నంగా రాసుకున్నారు దర్శకుడు ప్రేమ్ ఆనంద్. చాలా సంక్లిష్టమైన కథని తెరపై అర్థమయ్యేలా చూపించారు. ఈ కథలో సంతానం తన టైమింగ్ కామెడీతో చాలా చోట్ల నవ్వించాడు. రెగ్యులర్ సంతానంలా కాకుండా కిస్సా పాత్రలో తన హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ అన్నీ విభిన్నంగా చూపించారు.
సినిమాలో సంతానం సినిమా విమర్శకుడిగా నటించినా, ఆయన ఏ సినిమానీ రివ్యూ చేసే సీన్ లేకపోవడం ఆ పాత్రకి బలం చేకూర్చలేదు. కొన్ని చెత్త సినిమాలని తీసుకుని రివ్యూ చేసి ఉంటే బాగుండేది. అలా చేసి ఉంటేనే దెయ్యం వెంటపడుతుందని నమ్మేలా ఉండేది. యూట్యూబ్ రివ్యూయర్లని ట్రోల్ చేసే అవకాశం ఉన్నా, దాన్ని వాడుకోలేదు.