David Warner Telugu Movie: రాబిన్‌హుడ్ తో టాలీవుడ్ లోకి డేవిడ్ వార్నర్ ఎంట్రీ !
David Warner Telugu Movie: ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ 'రాబిన్‌హుడ్' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. పూర్తి వివరాలు మీకోసం.
David Warner Telugu Movie: ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ 'రాబిన్‌హుడ్' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. పూర్తి వివరాలు మీకోసం.
David Warner Telugu Movie: క్రికెట్ లో ధనాధన్ ఇన్నింగ్స్ లకు పెట్టింది పేరు డేవిడ్ వార్నర్. భారత దేశంలో ఈ ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ కు మంచి గుర్తింపు ఉంది. చాలా మంది అభిమానులు ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరఫున ఆడిన అతన్ని వార్నర్ భాయ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. క్రికెట్ లో అదరగొట్టిన ఈ స్టార్ ప్లేయర్ ఇప్పుడు వెండితెరపై దుమ్మురేపుతానంటున్నాడు. డేవిడ్ వార్నర్ త్వరలో విడుదల కాబోయే తెలుగు మూవీ రాబిన్ హుడ్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో నితిన్, శ్రీలీల ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
వార్నర్ తన X ఖాతాలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక పోస్టు పెట్టారు. భారతీయ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. సినిమా పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు. అదే రాబిన్‌హుడ్ మూవీ.
రాబిన్‌హుడ్ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. నితిన్ హీరోగా రాబోతున్న రాబిన్ హుడ్ చిత్రం మార్చి 28, 2025న విడుదల కానుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్‌గా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2016 విజేతగా నిలిచిన డేవిడ్ వార్నర్ కు భారతదేశంలో అపారమైన ప్రజాదరణ ఉంది. తెలుగు సినిమా పట్ల తనకున్న ప్రేమను తరచుగా చూపిస్తూ ఉంటాడు. COVID-19 లాక్‌డౌన్ సమయంలో పుష్పలోని శ్రీవల్లి, సరిలేరు నీకెవ్వరులోని మైండ్ బ్లాక్ వంటి ప్రసిద్ధ తెలుగు పాటలకు స్టెప్పులేస్తూ కనిపించిన డ్యాన్స్ వీడియోలు క్రికెట్‌కు మించి అతని అభిమానుల సంఖ్యను పెంచాయి.