బాలీవుడ్ ముద్దుగుమ్మ అమీషా పటేల్.. తెలుగులో నాలుగైదు సినిమాలు చేసి ఆకట్టుకుంది. గ్లామర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌ని షేక్ చేసింది. కానీ ఈ బ్యూటీ తెలుగులో సక్సెస్ కాలేకపోయింది. తెలుగులో బాలయ్య, పవన్, ఎన్టీఆర్, మహేష్ వంటి బిగ్ స్టార్స్ తో చేసింది. ఆమె నటించిన చిత్రాల్లో `బద్రి` హిట్ కాగా, `నాని`, `నరసింహుడు`, `పరమవీరచక్ర` చిత్రాలు పరాజయం చెందాయి. దీంతో బాలీవుడ్‌కి ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు సినిమాలు అడపాదడపా సినిమాల్లో మెరుస్తుందీ ముదురు భామ.