కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు.. ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కామెంట్స్..

First Published | Jul 4, 2023, 3:02 PM IST

క్రేజీ హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ఇండస్ట్రీలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వరుస ఆఫర్లను దక్కించుకుంటోంది. కానీ, తన కెరీర్ ప్రారంభంలో చాలా కష్టాలు పడ్డానంటూ ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ మాటలు వైరల్ గా మారాయి. 
 

‘సీతారామం’ హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అంతకుముందే మరాఠి హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా దుమ్ములేపుతోంది. సౌత్, నార్త్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమా ఛాన్స్  దక్కించుకుంటూ ఆశ్చర్యపరుస్తోంది. జెట్ స్పీడ్ తో కెరీర్ లో దూసుకుపోతోంది.
 

హిందీలోనూ ఆయా చిత్రాల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ‘సీతారామం’ తర్వాత బాగా ఫేమ్ దక్కించుకుంది. భారీ ఫాలోయింగ్ పెరిగిపోయింది. తన అద్భుతమైన నటనకు ప్రేక్షకులు ఫిదా అవడంతో వరుసపెట్టి ఆఫర్లు అందుకుంటోంది. అటు బాలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.
 


ప్రస్తుతం మృణాల్ కేరీర్ జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే కెరీర్ ప్రారంభంలో మాత్రం ఈ బ్యూటీ చాలా కష్టాలు ఎదుర్కొన్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది..... కెరీర్ ప్రారంభంలో కాస్తా బొద్దుగా, నిండు కుండలా ఉండేదంట. దాంతో అందరూ బాడీ షేమింగ్ చేశారని తెలిపింది. దాంతో సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేయాలంటే భయమేసిదనీ చెప్పింది.
 

అయితే, ఓసారి అమెరికా వెళ్లినప్పుడు ‘ఇండియన్ కర్దాషియన్’ అంటూ కామెంట్ చేశారంట. దాంతో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరిగాయని చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి ఎవరు ఏమనుకున్నా సరే తన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే వచ్చిందని కామెంట్స్ చేసింది. ఇక ప్రస్తుతం మాత్రం మృణాల్ నెట్టింట అందాలతో సునామీ తెప్పిస్తోంది. 
 

అటు వరుస చిత్రాలతో అలరిస్తూనే ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్  గా కనిపిస్తోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ గ్లామర్ షో చేస్తోంది. కొన్ని సందర్భాల్లో మృణాల్ పంచుకున్న ఫొటోలు నెట్టింటిని షేక్ చేసేలా ఉన్నాయి. ఇక రీసెంట్ గా మాత్రం కాస్తా పద్ధతిగా మెరుస్తూ వస్తోంది. 

ఇదిలా ఉంటే.. రీసెంట్ గా ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్ తో అలరించింది. ఏకంగా బెడ్ సీన్ లో రెచ్చిపోయి నటించింది. దీంతో మరోసారి సెన్సేషన్ గా మారింది. తెలుగులో నేచురల్ స్టార్ నాని సరసన Nani30లో నటిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ సరసన VD13లోనూ నటిస్తోంది. ఇటీవలె ఈచిత్రం ప్రారంభమైంది. అటు కోలీవుడ్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Latest Videos

click me!