దాసరి నారాయణరావు వందల కోట్ల ఆస్తులు దోచుకున్నది వాళ్లే.. గురువుగారు గురువుగారు అంటూ కాజేశారు

Published : May 26, 2025, 08:56 AM ISTUpdated : May 26, 2025, 03:13 PM IST

దర్శకరత్న దాసరి నారాయణరావు సంపాదించిన వందల కోట్ల ఆస్తులు ఏమయ్యాయి. గురువుగారు అంటూ నమ్మిన వాళ్లే దోచుకున్నారా? షాకింగ్‌ విషయాలు వెల్లడి. 

PREV
17
లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో దాసరి నారాయణ రావు

దర్శకరత్న దాసరి నారాయణరావు తెలుగు సినిమాని శాసించిన దర్శకుడు. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు ఆయన దర్శకుడిగా, నటుడిగా, రచయితగా, నిర్మాతగా రాణించారు. మల్టీటాలెంటెడ్‌గా నిరూపించుకున్నారు. 150కిపైగా చిత్రాలకు దర్శకత్వం వహించి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్ ల్లోకి ఎక్కారు. తెలుగులో అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్‌గా రికార్డు సృష్టించారు.

27
ఇండస్ట్రీ పెద్దగా దాసరి

దాసరి నారాయణ రావు  తన సినిమాల్లో ఎక్కువగా సామాజిక అంశాలను చర్చించారు. సామాజిక సమస్యలు, లింగ వివక్ష, కుల వివక్ష, రాజకీయ అవినీతి వంటి అంశాలపై ఎక్కువగా సినిమాలు తీశారు. సమాజాన్ని తట్టిలేపే ప్రయత్నం చేశారు. అంతేకాదు టాలీవుడ్‌లో ఇండస్ట్రీ పెద్దగానూ చెలామణి అయ్యారు. దాసరి ఉన్నంత కాలం తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ సమస్య అయినా ఆయన వద్దకే వెళ్లేది, అందులో చాలా వరకు ఆయనే పరిష్కారించేవారు.

37
అత్యధిక పారితోషికం అందుకున్న దర్శకుడు దాసరి

దాసరి నారాయణరావు అప్పట్లో దర్శకుడిగా పీక్‌లో ఉన్నారు. మూడు షిఫ్ట్ ల్లో సినిమాలు చేసేవారు. స్టార్ హీరోల వెంట పరిగెత్తకుండా దొరికిన హీరోతో సినిమాలు తీసి విజయాలు అందుకున్నారు. ఎంతో మంది దర్శకులకు, నటీనటులకు, టెక్నీషియన్లకి ఆయన లైఫ్‌ ఇచ్చారు. చిన్న హీరోతోనూ సినిమా చేసి హిట్లు కొట్టిన చరిత్ర ఆయనది. 

హీరోయిన్లతోనూ మూవీస్‌ చేసి హీరోలకు సమానంగా బాక్సాఫీసు వద్ద రచ్చ చేశారు. అయితే ఆ సమయంలో దర్శకుడిగా ఆయన పారితోషికం కూడా బాగానే తీసుకునేవారు. అత్యధిక పారితోషికం అందుకున్న దర్శకుడిగానూ నిలిచారు.

47
దాసరి వందల కోట్ల సంపాదన

ఇంకా చెప్పాలంటే తెలుగులో మరే దర్శకుడు సంపాదించని ఆస్తులు ఆయన సంపాదించారు. కానీ వాటిని నిలబెట్టుకోలేకపోయారు. ఆయన సన్నిహితులు, శిష్యులు చెప్పేదాన్ని బట్టి దాసరి సంపాదించిన ఆస్తుల విలువ వందల కోట్లు ఉంటుందట. 

కానీ వాటిలో చాలా వరకు నమ్మినవాళ్లే కాజేశారట. తన చుట్టూ ఉన్నవాళ్లే మోసం చేశారట. గురువుగారు గురువుగారు అంటూ పంగనామాలు పెట్టారట. ఈ విషయాన్ని దర్శకుడు, దాసరి శిష్యుడు నందం హరిశ్చంద్రరావు వెల్లడించారు. ట్రీ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను బయటపెట్టారు.

57
కొడుకులు పట్టించుకోలేదు, ఆస్తులన్నీ దొంగలపాలు

దాసరికి వచ్చిన ఆదాయాన్ని చూసుకునే ఇంటిమనుషులు లేరని, దానివల్లే ఆయన ఆస్తులన్నీ దొంగలపాలయ్యాయని తెలిపారు. దాసరి తన భార్య పద్మకి ఆర్థికపరమైన అధికారం ఇవ్వలేదని, తన వద్దకు వచ్చిన వాటితోనే ఆమె ఆస్తులు కొనిపెట్టిందని తెలిపారు. 

అయితే దాసరి కొడుకులు అప్పటికీ ప్రయోజనకారులు కాలేదు, ఫ్యామిలీని, మనీని మ్యానేజ్‌ చేసే స్థితిలో లేరు. పెద్ద కొడుకు అమ్మాయితో వెళ్లిపోయాడు, చిన్న కొడుకు జల్సాలకే పరిమితమయ్యాడు, బాధ్యతలు తీసుకోలేదు. దాసరి కూడా కొడుకులను పట్టించుకోలేదు.

67
గురువుగారు గురువుగారు అంటూనే పంగనామాలు

దీంతో దాసరి తనకు వచ్చే సంపాదనని చూసుకునే బాధ్యతని తనకు నమ్మకమైన వారికి అప్పగించారు. వారిలో చాలా మంది మోసం చేశారు. ఎక్కువ బిల్లులు వేయడం, వడ్డీలు ఎక్కువ కట్టడం చేశారు. ఇక తన వద్ద ఫైనాన్స్ తీసుకున్నవాళ్లు ఎగొట్టడం, తాను ఫైనాన్స్ తీసుకుంటే ఎక్కువ వడ్డీలు కట్టడం ఇలా సంపాదించిన ఆస్తులన్నీ కరిగిపోయాయని, 

తన చుట్టూ ఉన్నవాళ్లే, తనకు నమ్మకమైన వాళ్లే, రోజూ గురువుగారు గురువుగారు అంటూ తిరిగివాళ్లే ఆయన మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేశారని, ఆయన ఆస్తులను దోచుకున్నారని నందం హరిశ్చంద్రరావు తెలిపారు. దాసరి సంపాదించిన దాంట్లో ఇప్పుడు మిగిలిన ఆస్తులు సగం కూడా ఉండవని, అంతా తన చుట్టూ ఉన్నవాళ్లు, నమ్మకమైన వాళ్లే తిన్నారని హరిశ్చంద్రరావు వెల్లడించారు.

77
ఆస్తి కోసం కోర్ట్ మెట్లెక్కిన దాసరి కొడుకులు

ఆయన ఆస్తులను మంచిగా చూసుకునే ఫ్యామిలీ వాళ్లు ఎవరైనా ఉంటే ఇప్పుడు టాలీవుడ్‌లోనే రిచ్చెస్ట్ డైరెక్టర్‌గా దాసరి ఉండేవారని తెలిపారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇక దాసరి ఎనిమిదేళ్ల క్రితం (మే 30న) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన ఆస్తుల కోసం ఇద్దరు కొడుకులు ఆ తర్వాత కోర్ట్ మెట్లు ఎక్కడం గమనార్హం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories