అమితాబ్‌ బచ్చన్‌ రిజెక్ట్ చేసిన కథతో ఇండస్ట్రీ హిట్‌ అందుకున్న అనిల్ కపూర్.. 38 ఏళ్ళు పూర్తి

Published : May 25, 2025, 10:48 PM IST

 అనిల్ కపూర్, శ్రీదేవి నటించిన `మిస్టర్ ఇండియా` సినిమా విడుదలై 38 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సినిమా గురించి  ఇంట్రెస్టింగ్‌ విషయాలు తెలుసుకుందాం.  

PREV
17
1987లో సంచలనం సృష్టించిన `మిస్టర్‌ ఇండియా`

దర్శకుడు శేఖర్ కపూర్, నిర్మాత బోనీ కపూర్ ల `మిస్టర్ ఇండియా` సినిమా 1987 లో విడుదలైంది. బలమైన కంటెంట్‌తో వచ్చిన ఈ మూవీ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. 

27
రిజెక్ట్ చేసిన రాజేష్‌ ఖన్నా, అమితాబ్‌ బచ్చన్‌

సలీం-జావేద్.. రాజేష్ ఖన్నాను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా కథ రాశారని చాలా తక్కువ మందికి తెలుసు. ఈ మూవీ కోసం రాజేష్‌ ఖన్నానే ఫస్ట్ ఛాయిస్‌. కానీ ఆయన ఈ మూవీ చేసేందుకు నో చెప్పారు.  ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ కి కథ చెప్పగా, ఆయన కూడా తిరస్కరించారు. 

37
అమితాబ్‌ నో చెప్పడంతో అనిల్‌ కపూర్‌ వద్దకు

అమితాబ్ బచ్చన్ ఈ సినిమా చేయనని చెప్పిన తర్వాత, సలీం-జావేద్ ఈ  కథతో బోనీ కపూర్ ని కలిశారు. ఆయనకు కథ నచ్చి, తన తమ్ముడు అనిల్ కపూర్ పేరును సూచించారు. అనిల్ కి కథ నచ్చి, సినిమాకి ఒప్పుకున్నారు.

47
అనిల్‌ కపూర్‌కి జోడీగా శ్రీదేవి

`మిస్టర్ ఇండియా` సినిమాతో అనిల్ కపూర్ అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో ఆయనకు జోడీగా శ్రీదేవి నటించడం విశేషం. అమరీష్ పురి కూడా నెగటివ్‌ రోల్‌ చేశారు. అనిల్‌ కపూర్‌, శ్రీదేవి కాంబోలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బాలీవుడ్‌ బాక్సాఫీసుని షేక్‌ చేసింది. 

57
సినిమా మొత్తం ఒకే డ్రెస్‌తో అనిల్‌ కపూర్‌

`మిస్టర్ ఇండియా` సినిమా మొత్తంలో అనిల్ కపూర్ ఒకే జాకెట్, షర్ట్, ట్రౌజర్, టోపీ, బూట్లు వేసుకున్నారట. దర్శకుడు శేఖర్ కపూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. హీరో దుస్తులను చోర్ బజార్ నుండి కొన్నారని చెప్పారు.

67
2 కోట్లతో తీస్తే పది కోట్ల కలెక్షన్లు

`మిస్టర్ ఇండియా` సినిమాను శేఖర్ కపూర్ 2 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 10 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా అమితాబ్‌ తన కెరీర్‌లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ని మిస్‌ చేసుకున్నారని చెప్పొచ్చు.

77
`మిస్టర్‌ ఇండియా`కి రెండు రీమేక్‌లు

`మిస్టర్ ఇండియా` సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో, దక్షిణాదిలో రెండు రీమేక్స్ వచ్చాయి. అవి కూడా హిట్ అయ్యాయి. తమిళంలో 'ఎన్ రథతిన్ రథమే' (1989), కన్నడలో 'జై కర్ణాటక' (1989) పేరుతో రీమేక్ చేశారు. 2011 లో `మిస్టర్ ఇండియా 2` పేరుతో 3డి సీక్వెల్ ప్రకటించారు. కానీ అది ప్రకటనకే పరిమితమయ్యింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories