హత్య జరిగిన వెంటనే భార్యతో కలిసి దర్శన్ ఏం చేసాడంటే, షాకింగ్ విషయం బయిటకు

First Published Jun 21, 2024, 6:46 AM IST

భార్య విజయ్ లక్ష్మి, దర్శన్  విడిపోయి ఉంటున్నప్పుడు అతని చెప్పులు ఆమె ప్లాట్ లో ఎందుకు ఉన్నాయనే విషయం పోలీస్ లు కూపీ లాగితే ఈ విషయం బయిటకు వచ్చింది. 

Darshan Vijayalakshmi

ప్రముఖ కన్నడ నటుడు దర్శన్‌ (Darshan) అభిమాని హత్య కేసు సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. చిత్రదుర్గలోని తన అభిమాని రేణుకాస్వామి (28)ని అపహరించి.. హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దర్శన్‌ విచారణను పోలీసులు తీవ్రం చేశారు. ఇప్పటి వరకు ప్రశ్నలతోనే సరిపెట్టగా.. ఇప్పుడు తమదైన శైలిలో పోలీసులు విచారణ కొనసాగించారు. ఈ వ్యవహారంలో రోజు రోజుకీ అనేక కీలక విషయాలు బయిటకు వస్తున్నాయి. తాజాగా మరో విషయం బయిటకు వచ్చి షాక్ చేస్తోంది.


కన్నడ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు దర్శన్ తన అనుచరులతో ఈ మర్డర్ చేసాక బెంగుళూరులో ఓ డ్రైన్ లో ఆ బాడీని డిస్పోజ్ చేసారు. ఆ తర్వాత దర్శన్ ఏం చేసాడు ఇమ్మీడియట్ గా అనే ప్రశ్న ఎదురైంది. దర్శన్ ఈ హత్య జరిగిన   తర్వాత  ఏమీ తెలియనట్లు, ఏమీ జరగనట్లు కారులో హోసర్ కేల్ హల్లీలో ఉన్న తన భార్య విజయ్ లక్ష్మి ఇంటికి వెళ్లారు. అక్కడ తన భార్యతో కలిసి తమ ప్లాట్ లో పూజ నిర్వహించారు. 

Latest Videos



భార్య విజయ్ లక్ష్మి, దర్శన్  విడిపోయి ఉంటున్నప్పుడు అతని చెప్పులు ఆమె ప్లాట్ లో ఎందుకు ఉన్నాయనే విషయం పోలీస్ లు కూపీ లాగితే ఈ విషయం బయిటకు వచ్చింది. దాంతో ఆమెను పోలీస్ లు తీసుకు వెళ్లి ఐదు గంటలు సేపు విచారించారు. ఆమెను కూడా ఈ కేసులో విట్నెస్ గా లిస్ట్ లో చేర్చారు.  
 

<

రేణుకాస్వామిని ఈ నెల 8న సాయంత్రం హత్య చేసిన తరువాత సాక్ష్యాలను చెరిపివేసేందుకు నిందితులు ప్రయత్నించారని పోలీస్‌ అధికారులు వివరించారు. రాజరాజేశ్వరినగరలోని ఒక దుస్తుల దుకాణంలో కొత్త వస్త్రాలు కొనుగోలు చేశారు. హంతకుల్లో ఇద్దరు లక్ష్మణ, నాగరాజు స్థానికంగా ఉన్న శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర గుడికి వెళ్లారు. శవాన్ని పడేశాక ఇతర నిందితులు తమ ఇళ్లకు వెళ్లిపోయారని అధికారుల దర్యాప్తులో తేలింది.


రేణుకాస్వామి హత్యకు ముందు ఆర్‌ఆర్‌నగరలో ఓ బార్‌లో దర్శన్‌ బృందం మందు విందు చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ పార్టీకి హాజరైన సినీనటుడు చిక్కణ్ణకు ఇప్పటికే తాఖీదులివ్వగా మరో నటుడు యశస్‌ సూర్యను విచారించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఆ పార్టీకి సూర్య హాజరైనట్లు అధికారులు వివరించారు. ఆ పార్టీ ముగిసిన తరువాత హత్యకు కేంద్రమైన పట్టణగెరె షెడ్‌కు దర్శన్‌తో కలసి వారు వెళ్లారా? అనే వివరాలు రాబట్టనున్నారు. 


షెడ్‌ యజమాని జయణ్ణను విచారించారు. ఆ షెడ్‌ను కిశోర్‌ అనే వ్యక్తికి అద్దెకిచ్చినట్లు జయణ్ణ వివరించాడు. మరోవైపు దర్శన్‌కు చెందిన వ్యవసాయక్షేత్ర మేనేజరు శ్రీధర్‌ (35) అనుమానాస్పదంగా మరణించాడనే విషయం చర్చకు తావిస్తోంది. ఆయన ఆనేకల్‌లో ఏప్రిల్‌ 17న విషం తాగి చనిపోయాడని గుర్తించారు. ఆ ఘటనకు బాధ్యులెవరనే కోణంలో తాజాగా దర్యాప్తు మొదలు కావడం దర్శన్‌కు సంకటప్రాయమే.


ఒకప్పుడు దర్శన్‌ అనగానే ఆయన సోదరుడు దినకర్‌ గుర్తుకు వచ్చేవాడు. తన సోదరుడ్ని పోలీసులు అరెస్టు చేసినా.. ఆయన ఇప్పుడు బయటకు రాలేదు. తల్లిని, సోదరుడ్ని, ఇతర కుటుంబ సభ్యులను దర్శన్‌ నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆయన దూరమయ్యారని సమాచారం. 


సినీనటుడు దర్శన్‌ సెల్‌ఫోన్లో నగరంలోని ప్రముఖ రౌడీషీటర్ల ఫోన్‌ నెంబర్లు ఉన్నాయని దర్యాప్తు అధికారులు గుర్తించారు. దర్శన్‌ ఎక్కడికి వెళ్లినా ఈ ముఠా వెంటవెళ్లి, అభిమానులను పోగు చేసేవారని, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే బెదిరించేవారని సమాచారం.

Darshan

భార్య విజయలక్ష్మిపై పలుసార్లు చేయి చేసుకుని, దూషించినా, భర్త తరఫున వాదించేందుకు ఆమే ప్రస్తుతం న్యాయవాదిని ఏర్పాటు చేయడం కొసమెరుపు! హత్య కేసులో అన్నపూణేశ్వరినగర పోలీసుఠాణా కస్టడీలో ఉన్న సినీనటుడు దర్శన్‌ను పరామర్శించేందుకు తొలిసారిగా ఆయన భార్య విజయలక్ష్మీ బుధవారం ముందుకొచ్చారు. ఆమె ఉదయమే పోలీసుఠాణాకు చేరుకోవడం ప్రస్తావనార్హం. ఆయన అరెస్టైన తొమ్మిది రోజులకు ఆమె స్పందించారు. ఇప్పటికే ఆమె తన పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో దర్శన్‌ చిత్రాలను తొలగించారు. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండిపోయారు. 


ప్రస్తుతం.. భర్తతో మాట్లాడేందుకు పోలీసు అధికారుల అనుమతి తీసుకున్నారు. ఆయనకు జామీను సాధించడానికి ప్రముఖ న్యాయవాదులు రంగనాథ్‌రెడ్డి, అనిల్‌బాబును నియమించారు. విజయలక్ష్మీ- దర్శన్‌ 2003లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికీ ఓ కుమారుడున్నాడు. 2011లో విజయలక్ష్మీపై దర్శన్‌ దాడి చేసి గాయపరిచాక.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఇద్దరూ రాజీపడి కాపురం చేశారు. ఇదే క్రమంలోనే ఆయన నటి పవిత్రాగౌడ ప్రేమలో పడ్డా.. భార్యాభర్తల గొడవలు అధికమయ్యాయి. ఆ గొడవలన్నీ మరచి ఆమె భర్త కోసం ‘న్యాయ’ సహాయం అందించడం ప్రస్తావనార్హం.
 

తాజాగా దర్శన్ భార్య విజయలక్ష్మి దర్శన్ అరెస్ట్ అయిన తర్వాత మొదటిసారి సోషల్ మీడియాలో స్పందించింది. కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి ఓ పోస్ట్ పెట్టింది విజయలక్ష్మి. విజయలక్ష్మి తన పోస్ట్ లో.. రేణుకాస్వామి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అతని మరణాన్ని తట్టుకునే శక్తిని వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. గత కొద్ది రోజులుగా దర్శన్, నేను, మా అబ్బాయి, దర్శన్ కుటుంబ సభ్యులు మాటల్లో వర్ణించలేని బాధను అనుభవిస్తున్నాము. గౌరవనీయమైన న్యాయస్థానం ఉత్తర్వుల ప్రకారం, మీడియా మరియు సోషల్ మీడియా, సైట్ లలో ఎలాంటి తప్పుడు వార్తలు, అనధికారిక సమాచారాన్ని ప్రచురించవద్దని నేను కోరుకుంటున్నాను. అధికారులు వెల్లడించిన సమాచారం మాత్రమే ప్రచురించాలని కోరుకుంటున్నాను. చాముండేశ్వరి అమ్మవారిపై, మన న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది అని పోస్ట్ చేసింది.

Darshan


మరో ప్రక్కన దర్శన్ ...తన అభిమానులు పోలీస్ స్టేషన్  వద్దకు వస్తారని, ఎందరో నాయకులు తెలుసంటూ బీరాలు పలికిన ఆయన మాటలను పోలీసులు పట్టించుకోలేదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి ఇది సినిమా కాదని, నిజజీవితమని హితవు పలికారు. అప్పటికీ తీరు మార్చుకోకపోవడంతో విచారణ శైలిని మార్చారు. అక్కడితో ఆ  హీరో తప్పించుకోవడం కుదరదని తెలుసుకున్నాడు. నటి పవిత్రాగౌడను విడిచి పెట్టాలని కోరిన దర్శన్‌.. ఇపుడా డిమాండు పక్కనపెట్టాడు. 

Darshan Rachita Ram


రేణుకాస్వామి మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా మాయం చేయాలని మరో నిందితుడైన ప్రదేశ్‌కు రూ.30లక్షలు ఇచ్చినట్లు దర్శన్‌ అంగీకరించాడు. ఈ వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తన పేరు బయటకు రాకుండా చూడాలని కోరినట్లు తెలిపాడట. దర్శన్‌ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
 


ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన నిందితుల సంఖ్య 17.. వారిలో సగం మందితో దర్శన్‌కు ముఖ పరిచయం కూడా లేదు. తనకు తెలియకుండానే బాడుగ కారులో రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు తీసుకువచ్చిన డ్రైవరు రవి ఈ ఉచ్చులో ఇరుక్కుపోయాడు. మిగిలిన వారిలో ఎక్కువ మంది బాధితుడ్ని వేధించి, చిత్రహింస పెట్టడం, మృతదేహాన్ని తరలించడంలో కీలక పాత్రను పోషించినవారే.సాధ్యమైనంత త్వరలో  కేసు విచారణను ఒక కొలిక్కి తీసుకువచ్చే దిశగా పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు.
 

click me!