అనుపమా పరమేశ్వరన్ అంటూ ట్రెడిషనల్ లుక్ కి పెట్టింది పేరు. `ప్రేమమ్`, `అఆ` చిత్రాల్లో ఈ అమ్మడిని చూస్తే క్యూట్ లుక్స్ కి ఫిదా అయిపోతారు. చంద్రబింబం లాంటి ముఖాన్ని చూసి తమని తాము మర్చిపోతారు. అంతగా ఆకట్టుకుంది అనుపమా పరమేశ్వరన్.
ఇప్పటి వరకు గ్లామర్‌కి దూరంగా ఉంటూ అభినయంతోనే మెస్మరైజ్ చేస్తూ వస్తోంది అనుపమా పరమేశ్వరన్. తాజాగా కర్లీ హెయిర్‌లో మెరిసిపోయింది. వైట్ టాప్‌లో ఈ అమ్మడు పంచుకున్న పోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి.
అయితే ఇందులో అనుపమా లుక్స్ పిచ్చెక్కిస్తున్నాయి. నిషా ఎక్కించేలా ఉన్న ఆమె చూపులు.. చూపుతిప్పుకోనివ్వడం లేదు. ఆల్కహాల్ తీసుకోకుండానే కిక్కేక్కిస్తున్నాయి. ఈసందర్భంగా అనుపమా చెబుతూ, ఇలా చూస్తే తన ఆలోచనల్లో పడిపోతారని పేర్కొంది.
అనుపమా పరమేశ్వరన్ `రాక్షసుడు` చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మంచి ఆఫర్ల కోసం గ్యాప్ తీసుకున్న అనుపమా పరమేశ్వరన్ ఇప్పుడు మూడు తెలుగు సినిమాలతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
అందులో భాగంగా నిఖిల్‌తోనే రెండు సినిమాలు చేస్తుంది అనుపమా. `18పేజెస్`తోపాటు `కార్తికేయ2`లో నటిస్తుంది. `18పేజెస్` చిత్రం దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీ అవుతుంది. మరోవైపు `కార్తికేయ2`లో తనని కన్ఫమ్ చేస్తూ ఇటీవలే అప్‌డేట్ ఇచ్చింది యూనిట్.
మరోవైపు దిల్‌రాజ్ ప్రొడక్షన్‌లో `రౌడీబాయ్స్` అనే చిత్రంలో నటిస్తుంది. దిల్‌రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ నటిస్తున్న చిత్రమిది. ఇటీవల విడుదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.ఇందులో అనుపమా క్యూట్ లుక్స్ కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి.
గ్లామర్‌కి అతీతంగా నటకు ప్రయారిటీ ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది అనుపమా పరమేశ్వరన్. అందులో భాగంగానే చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. గతంలో గ్లామర్‌కి దూరంగా ఉన్న ఈ భామ ఇటీవల హాట్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుని తాను స్కిన్ షోకి సిద్ధమే అనే సిగ్నల్స్ ఇస్తుంది. తాజాగా పంచుకున్నఫోటోలు కూడా అంతే హాట్‌గా ఉండటం విశేషం.