సాయిపల్లవి, నాగచైతన్య జంటగా నటించిన `లవ్‌స్టోరి` చిత్రం ఇటీవల విడుదలైంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో నాగార్జున ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఆమె నటనకి, డాన్సులకు ఫిదా అయినట్టు చెప్పారు.
ఇదిలా ఉంటే ట్రెడిషనల్‌గా కనిపించే సాయిపల్లవి ఈ సినిమాలో లిప్‌లాక్ సీన్లు చేసింది. నాగచైతన్యతో గొడవ జరిగినప్పుడు సడెన్‌గా ముద్దు పెట్టి వెళ్లిపోతుంది. మరోవైపు మెట్రో ట్రైన్‌లోనూ ఓ కిస్ పెడుతుంది. ఈ నేపథ్యంలో దీనిపై చర్చ మొదలైంది. సాయిపల్లవి ఇలాంటి సీన్ చేయడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి దీనిపై స్పందించింది. యాంకర్ అడిగిన ప్రశ్నకి ఆమె సమాధానం తెలిపింది. లిప్‌లాక్‌లోని అసలు సీక్రెట్‌గా బయటపెట్టింది. అదంతా కెమెరా ట్రిక్ అని వెల్లడించింది.
`ముద్దు సన్నివేశంలో నాగచైతన్యను నేను నిజంగా ముద్దు పెట్టుకోలేదు. కెమెరామెన్ ఆ సన్నివేశాన్ని నిజం అనిపించేలా కెమెరా యాంగిల్ పెట్టి సెట్ చేశారు. ఎందుకంటే ముద్దు సన్నివేశాల్లో నేనేప్పుడు నటించలేదు. సినిమాకు డేట్స్ ఇచ్చేటప్పుడే ఇలాంటి సీన్లలో నటించనని డైరెక్టర్లకు ముందే స్పష్టం చేస్తాను.
అలాగే ఈ సినిమాలో ముద్దు సీన్‌లో నటించమని డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. పాత్ర బాగుంటే పర్‌ఫార్మెన్స్ దానికదే బెస్ట్ గా వస్తుందని నా ఫీలింగ్` అని తెలిపింది సాయిపల్లవి. ఇకపై కూడా ముద్దు సన్నివేశాల్లో నటించబోనని స్పష్టం చేసింది సాయిపల్లవి.
ఇక `లవ్‌స్టోరి`లో సాయిపల్లవి మౌనిక పాత్రలో ఒదిగిపోయింది. అద్భుతమైన డాన్సర్‌గా మరోసారి నిరూపించుకుంది. డాన్స్ పరంగా నెక్ట్స్ లెవల్‌ని చూపించింది. ఆమె పాత్రే సినిమాకి బ్యాక్‌బోన్‌గా నిలిచింది. అయితే ప్రస్తుతం సినిమాకి మిశ్రమ స్పందనే దక్కుతున్నట్టు సమాచారం.
సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో నానితో `శ్యామ్ సింగరాయ్`, అలాగే రానాతో `విరాటపర్వం` చిత్రంలో నటిస్తుంది. ఇందులో వెన్నెలగా విప్లవ భావాలకు ఆకర్షితురాలైన అమ్మాయిగా సాయిపల్లవి కనిపించబోతుంది. ఆమె పాత్ర మరో హైలైట్‌గా ఉంటుందని సమాచారం.
ప్రతిభ ఉంటే అందాల ఆరబోతతో పనిలేదని, అది అసలు మ్యాటరేకాదని నిరూపించింది సాయిపల్లవి. ఆమె సినిమా అంటే ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉండటం విశేషం. అంతేకాదు ఇప్పుడు తనని చూసేందుకు సినిమాకి వచ్చే అభిమానం ఏర్పడటం మరో విశేషం.