హరీష్ శంకర్ ఇప్పుడు తన ఫోకస్ మొత్తం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీపైకి షిఫ్ట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ తప్పిస్తే ‘ఉస్తాద్ భగత్ సింగ్’షూటింగ్ జరిగింది లేదు. మేజర్ పోర్షన్ షూటింగ్ పెండింగ్ ఉంది. దాంతో ఇప్పుడు ఆయన స్క్రిప్టులో మార్పులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్క్రిప్టుపై రీవర్క్ చేస్తున్నాయి.
కొన్ని కీలకమైన మార్పులు సెకండాఫ్ లో చేయబోతన్నారని వినికిడి. గత పది రోజులుగా తన టీమ్ తో హరీష్ కూర్చుంటున్నారట. రీసెంట్ గా అమెరికా వెళ్లిన ఆయన వచ్చాక మళ్ళీ స్క్రిప్ట్ పనిమీదే ఉంటారు. అక్టోబర్ నెలాఖరకు పూర్తి బౌండ్ స్క్రిప్టుతో పవన్ ని కలవబోతున్నారట. తను చేసిన మార్పులు చెప్పబోతున్నారట.